సివిల్స్ సాధించాలంటే ఈ ఫోన్ వాడండి!

మనలో చాలామంది ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. ఆ లక్ష్యాలను సాధించడానికి ఎంతో శ్రమించాలని అనుకుంటూ ఉంటారు. కానీ వివిధ కారణాల వల్ల ఆ లక్ష్యాలను సాధించలేక చిన్నచిన్న ఉద్యోగాలతో సరిపెట్టుకుంటూ ఉంటారు. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా వాడకం వల్లే చాలామంది ఎంచుకున్న లక్ష్యాలను సాధించడంలో సఫలం కాలేకపోతున్నారు. మరి ఈ సమస్యలను అధిగమించడం ఎలా…? అనే ప్రశ్న చాలామందిని వేధిస్తోంది. Also Read : ఆ విద్యార్థి చదువు కోసం ఊరికి ఇంటర్నెట్ సౌక‌ర్యం క‌ల్పించిన […]

Written By: Kusuma Aggunna, Updated On : August 25, 2020 10:06 am
Follow us on

మనలో చాలామంది ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. ఆ లక్ష్యాలను సాధించడానికి ఎంతో శ్రమించాలని అనుకుంటూ ఉంటారు. కానీ వివిధ కారణాల వల్ల ఆ లక్ష్యాలను సాధించలేక చిన్నచిన్న ఉద్యోగాలతో సరిపెట్టుకుంటూ ఉంటారు. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా వాడకం వల్లే చాలామంది ఎంచుకున్న లక్ష్యాలను సాధించడంలో సఫలం కాలేకపోతున్నారు. మరి ఈ సమస్యలను అధిగమించడం ఎలా…? అనే ప్రశ్న చాలామందిని వేధిస్తోంది.

Also Read : ఆ విద్యార్థి చదువు కోసం ఊరికి ఇంటర్నెట్ సౌక‌ర్యం క‌ల్పించిన సోనూసూద్!

తాజాగా సివిల్ సర్వీసెస్ లో విజయం సాధించాలని అనుకున్న ఒక వ్యక్తి తన కలను నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో సోషల్ మీడియా వేదికలలో ఒకటైన ట్విట్టర్ ద్వారా సివిల్ సర్వీసెస్ సాధించాలంటే ఏం చేయాలని ఒక ఐపీఎస్ అధికారిని కోరాడు. తన ప్రశ్నకు ఒకే లైన్ లో సమాధానం కావాలని సదరు అభ్యర్థి కోరాడు. దానికి ఐపీఎస్ అధికారి ఎవరూ ఊహించని సమాధానం ఇచ్చి ప్రశ్న అడిగిన వ్యక్తితో పాటు నెటిజన్లను సైతం ఆశ్చర్యపరిచాడు.

సివిల్స్ సాధించటానికి మొదట ప్రస్తుతం వినియోగిస్తున్న స్మార్ట్ ఫోన్ ను వదిలి నోకియా 5310 ఫోన్ ను వాడాలని ఐపీఎస్ అధికారి సలహా ఇచ్చాడు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా ఈ విషయాలను వెల్లడించాడు. ప్రసుత పరిస్థితుల్లో స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరికీ అవసరమే అయినా లక్ష్యాన్ని సాధించడానికి స్మార్ట్ ఫోన్ అడ్డుగా నిలుస్తోందని అరుణ్ బోత్రా అభిప్రాయపడ్డారు. అధికారి ఇచ్చిన సమాధానం కరెక్ట్ అని చాలామంది నెటిజన్లు చెబుతున్నారు. ఫీచర్ ఫోన్ వాడటం ద్వారా దృష్టి మరలదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : వలస కార్మికులకు విమాన టికెట్లు బుక్‌ చేసి నెటిజన్ల మనసు దోచిన రైతు!