ఏపీలో లక్షణాలు లేకపోయినా 90 శాతం మందికి కరోనా…?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో నమోదవుతున్న కేసులు ప్రజలు రోడ్లపైకి అడుగు పెట్టాలంటేనే భయపడేలా చేస్తున్నాయి. వైరస్ గురించి అధికారులు చేస్తున్న సర్వేల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా లక్షణాలైన జ్వరం, దగ్గు లాంటి లక్షణాలు 90 శాతం మందిలో కనిపించడం లేదని సీరో సర్వైలెన్స్ సర్వేలో వెల్లడైంది. Also Read : అమరావతి విషయంలో బాబు వ్యూహం…. మొదటికే మోసం? నెల్లూరు, కృష్ణా, తూర్పుగోదావరి, అనంతపురం […]

Written By: Navya, Updated On : August 25, 2020 9:53 am
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో నమోదవుతున్న కేసులు ప్రజలు రోడ్లపైకి అడుగు పెట్టాలంటేనే భయపడేలా చేస్తున్నాయి. వైరస్ గురించి అధికారులు చేస్తున్న సర్వేల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా లక్షణాలైన జ్వరం, దగ్గు లాంటి లక్షణాలు 90 శాతం మందిలో కనిపించడం లేదని సీరో సర్వైలెన్స్ సర్వేలో వెల్లడైంది.

Also Read : అమరావతి విషయంలో బాబు వ్యూహం…. మొదటికే మోసం?

నెల్లూరు, కృష్ణా, తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాల్లో సర్వే నిర్వహించిన అధికారులు అనంతపురంలో ఏకంగా 99.5 శాతం మందిలో లక్షణాలు కనిపించపోయినా కరోనా నిర్ధారణ అయిందని నెల్లూరు జిల్లాలో 96.1 శాతం, కృష్ణా జిల్లాలో 99.4 శాతం, తూర్పుగోదావరి జిల్లాలో 92.8 శాతం మందికి కరోనా నిర్ధారణ అయిందని వెల్లడించారు. కృష్ణా జిల్లాలో 22.3 శాతం మందికి కరోనా వచ్చి పోయిందని వారిలో యాంటీబాడీలు డెవలప్ అయ్యాయని అధికారులు తెలిపారు.

కరోనా లక్షణాలు కనిపించకుండా పాజిటివ్ నిర్ధారణ అయిన వాళ్లు పది రోజుల పాటు ఐసోలేషన్ కేంద్రాలు లేదా ఆస్పత్రులలో ఉంటే సరిపోతుందని… వైరస్ లోడ్ పెరిగి లక్షణాలు కనిపిస్తే మందులు వాడాలని… లేకపోతే బలవర్థక ఆహారం తీసుకుంటే సరిపోతుందని అధికారులు వెల్లడించారు. లక్షణాలు కనిపించని వాళ్లు 11వ రోజు నుంచి బయట తిరిగినా వాళ్ల నుంచి వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందదని… వాళ్లకు మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం కూడా లేదని ప్రకటన చేశారు.

Also Read : జగన్ ను చావు దెబ్బ కొట్టేందుకు కేసీఆర్ రె’ఢీ’..!