
Dasara Records: న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘దసరా’ చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతం లో వసూళ్లు తగ్గిపోయినప్పటికీ నైజాం మరియు ఓవర్సీస్ ప్రాంతాలలో మాత్రం వసూళ్ల సునామి ఇంకా ఆగలేదు.
నైజాం లో స్టార్ హీరో రేంజ్ లో ఈ సినిమా 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది, అలాగే ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం మీడియం రేంజ్ హీరోలు ఎవ్వరూ చెయ్యలేని రేర్ ఫీట్ ని చేసింది.అక్కడ ఈ చిత్రానికి ఈ శనివారం తో కలిపి రెండు మిలియన్ డాలర్ల మార్కు ని అందుకోబోతుంది.స్టార్ డైరెక్టర్ సపోర్టు లేకుండా, ఎంటర్టైన్మెంట్ మూవీ కాకుండా ఒక సీరియస్ సబ్జెక్టు తో ఈ రేంజ్ వసూళ్లను రాబట్టిన మీడియం రేంజ్ హీరో ఒక్కడు కూడా లేదు.
నాని కి మొదటి నుండి USA లో మంచి బ్రాండ్ ఇమేజి ఉంది, హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఆయన సినిమాలు ఇక్కడ మంచి వసూళ్లను రాబడుతాయి.సూపర్ స్టార్ మహేష్ బాబు తర్వాత అత్యధిక 1 మిలియన్ డాలర్ల సినిమాలు కలిగి ఉన్న ఏకైక హీరో నాని మాత్రమే.పవన్ కళ్యాణ్ మరియు జూనియర్ లాంటి స్టార్ హీరోలకు కూడా అన్ని 1 మిలియన్ డాలర్ల సినిమాలు లేవు.ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా తన సొంత కష్టం తో నాని ఈ రేంజ్ కి చేరుకున్నాడు అంటే సాధారణమైన విషయం కాదు.

సెకండ్ హాఫ్ లో కొన్ని ఎంటర్టైన్మెంట్ సన్నివేశాలు పెట్టి ఉంటే ఈ సినిమా కచ్చితంగా వంద కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.ఒక విధంగా చూస్తే ఇది కూడా నిజమే, పాపం నాని బ్యాడ్ లక్ అనుకోవాల్సిందే, ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో లో అయినా వంద కోట్ల రూపాయిల షేర్ కొల్లగొట్టే ఏకైక మీడియం రేంజ్ హీరో నాని మాత్రమే అని అంటున్నారు ట్రేడ్ పండితులు.