
Dasara Box Office Collection: న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘దసరా’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై పాజిటివ్ టాక్ ని దక్కించుకొని కనీవినీ ఎరుగని రేంజ్ ఓపెనింగ్స్ ని దక్కించుకుంది. అమెరికా నుండి అనకాపల్లి వరకు ఈ సినిమాకి వస్తున్న వసూళ్లు చూసి ట్రేడ్ పండితులు సైతం నోరెళ్లబెడుతున్నారు. ప్రతీ చోట ఈ చిత్రం మీడియం రేంజ్ హీరోల మొదటి రోజు వసూళ్లకంటే మూడు రెట్లు ఎక్కువ వసూళ్లను రాబట్టింది.
కొన్ని ప్రాంతాలలో కేవలం మీడియం రేంజ్ హీరోల కలెక్షన్స్ ని మాత్రమే కాదు, స్టార్ హీరోల వసూళ్లను కూడా దాటేస్తుందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ వసూళ్లను ఈ చిత్రం కొన్ని ప్రాంతాలలో దాటేసింది అంటున్నారు. నైజాం ప్రాంతం లో ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం మొదటి రోజు ఆరు కోట్ల 58 లక్షల షేర్ వసూళ్లను రాబట్టింది.
కానీ దసరా మూవీ కి వస్తున్న వసూళ్లు చూస్తుంటే మొదటి రోజు కేవలం నైజాం ప్రాంతం నుండే 7 కోట్ల రూపాయలకు పైగా షేర్ వస్తుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అంటే మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’ సినిమా కంటే ఎక్కువ వసూళ్లు అన్నమాట. ఇది నాని కి నిజంగా గర్వించదగ్గ విషయం అనే చెప్పాలి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వచ్చిన నాని, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి రేంజ్ వసూళ్లను రాబడుతున్నాడు అంటే, ఆయన కష్టం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

ఇన్ని రోజులు నాని భారీ సినిమాలు తియ్యకుండా తప్పు చేశాడా..?, ఆయనకీ ఉన్న యాక్టింగ్ స్కిల్స్ కి ఇలాంటి భారీ సినిమాలు చేస్తూ పొయ్యుంటే, నేడు టాప్ 5 స్టార్ హీరోలలో ఒకరిగా నిలిచేవాడని అంటున్నారు విశ్లేషకులు.ప్రస్తుతం ‘దసరా’ మూవీ కి వస్తున్న వసూళ్లు చూస్తూ ఉంటే రాబొయ్యే రోజుల్లో 80 నుండి 90 కోట్ల రూపాయిల షేర్ ని రాబడుతుందని అంచనా వేస్తున్నారు.