
Harshasai: హర్షసాయి.. ఈ పేరు యూత్‌లో చాలా మందికి తెలుసు. యూట్యూబ్ స్టార్‌గా, సోషల్ సర్వీస్ చేసే స్టూడెంట్‌గా గుర్తింపు ఉన్న హర్షకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియా ద్వారా తనకు వస్తున్న ఆదాయంలోనే ఆయన ఎంతో మంది జీవితాలను నిలబెట్టాడు. నిరుపేదలకు అండగా నిలిచాడు. పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక సాయం అందించాడు. ఆడ పిల్లల పెళ్లికి చేయూతనిచ్చాడు. తాజాగా హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న ఓ పేదింటి మహిళకు అండగా నిలిచి కన్నీళ్లు పెట్టంచాడు.
పరిస్థితి తెలుసుకుని సాయం..
హర్షసాయి.. ఊరికే ఎవరికీ సాయం చేయడు. ఆయన సొంతంగా గమనిస్తాడు. వారు కష్టాల్లో ఉన్నారని నిర్ధారించుకున్నాకే తాను సాయానికి ముందుకు వస్తాడు. ఇందుకోసం తాను సాయం చేయాలనుకున్నవారిని ముందుగా సెలక్ట్ చేసుకుంటాడు. ఆ విషయం ఎవరికీ తెలియదు. తర్వాత తన మిత్రులను పంపించి సాయం చేయాలనుకుంటున్న వారి పరిస్థితిని ఆరా తీస్తాడు. ఆర్థిక పరిస్థితి, ఇతర కష్టాలు తెలుసుంటాడు. తర్వాతనే సాయం అందిస్తాడు. ఇలా స్లమ్ ఏరియాలో ఎంతో మందికి చేకూతనిచ్చాడు. బార్బర్‌ను షాన్ ఓనర్‌ని చేశాడు. పేద ఆడపిల్ల పెళ్లికి అండగా నిలిచాడు.
పేదింటి మహిళకు..
తాజాగా ఓ పేదింటి మహిళకు సాయం చేయాలనుకున్నాడు. ఆమె గురించి తెలుసుకున్నాడు. నిత్యం రోడ్డు పక్కన హోటల్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు గుర్తించాడు. ఆమే ఆ కుటుంబానికి ఆధారం అని నిర్ధారించుకున్నాడు. తర్వాత ఒక రోజు కారులో ఆ పేద మహిళ నిర్వహిస్తున్న హోటల్ వద్దకు వెళ్లాడు. అమా ఆకలేస్తుంది అన్నం పెట్టడంని అడిగాడు. అయితే కారులో టిప్‌టాప్‌గా వచ్చిన అతడు తన హోటల్‌లో భోజనం చేయడం ఏంటని ఆ మహిళ ఆశ్చర్య పోయింది. ఈ సందర్భంగా గతంలో పరిచయం ఉన్న వ్యక్తిలా, దూరపు బంధువులా మాటలు కలిపాడు. ఈ సందర్భంగా మహిళ భోజనం వడ్డించబోగా, ఒక్క మెతుకు, ఒకే ఒక్క మెతుకు తిన్నాడు. తర్వాత బిల్లు ఎంతని అడిగాడు. ఒక్క మెతుక్కు బిల్లెందుకని ఆమె అనగానే.. వెంటనే తన సహాయకుడితో సూట్‌కేస్ తెప్పించి అందులో నుంచి కట్టల కొద్ది డబ్బులు తీసి ఆమెకు అందించాడు. వద్దని వారించినా వినలేదు.

దుఃఖం.. ఆనందం రెండు కలిపి..
ఈ సందర్భంగా హర్ష అసలు విషయం చెప్పాడు. తనకు సాయం చేయడానికే వచ్చానని, పరిస్థితిని తెలుసుకున్నానని చెప్పాడు. తన చిన్నసాయం స్వీకరించాలని కోరాడు. దీంతో ఆ డబ్బులు తీసుకున్న పేద మహిళ మోములో దుఃఖం, ఆనందం కలిపి వచ్చిన దృశ్యం స్పష్టంగా కనిపించింది. ఈ మొత్తం దృశ్యాన్ని వీడియో తీయించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు హర్షం. ఈ పోస్టుకు కూడా 256 కె లైక్స్ వచ్చాయి. 2.5 కె మంది కామెంట్ చేశారు. హర్ష చేసిన పనికి అతని ఫాలోవర్స్ అంతా ఫిదా అయ్యారు. హాట్ టచ్చింగ్ అంటూ కొందరు.. తమకూ సాయం చే యాలని మరికొందరు. ఎక్స్‌లెంట్ వర్క్ అని ఇంకొందరు.. గ్రేట్ జాబ్ అంటూ మరికొందరు కామెట్స్ చేశారు.