
Dasara Climax: న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘దసరా’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల టేకింగ్ మరియు నాని అద్భుతమైన నటన ఈ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లింది. ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరు మాట్లాడుకునేది కేవలం రెండిటి గురించే. ఒకటి ఇంటర్వెల్ షాట్ కాగా మరొకటి క్లైమాక్స్. ఈ రెండు షాట్స్ ఐకానిక్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశం మాత్రం ఆడియన్స్ మైండ్ ని బ్లాస్ట్ చేసేసింది.
నూతన దర్శకుడు ఇంత ప్రతిభ చూపించడం అంటే సాధారణమైన విషయం కాదు.అయితే ఈ చిత్రం చూస్తున్నంత సేపు మనకి ‘రంగస్థలం’ సినిమా గుర్తుకొస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ లో హీరో స్నేహితుడిని చంపినప్పుడు ‘రంగస్థలం’ లో ప్రెసిడెంట్ ఎలా అయితే హీరో తమ్ముడిని చంపించాడో, అలా ఈ సినిమాలో కూడా హీరో స్నేహితుడిని ప్రెసిడెంట్ యే చంపించి ఉంటాడేమో అని మనం కూడా అనుకుంటాం.
కానీ డైరెక్టర్ అలా కాకుండా వేరే విధంగా సెకండ్ హాఫ్ ని నడిపించాడు.ఇక చిత్రం లో హైలైట్ గా మారిన క్లైమాక్స్ సన్నివేశం గత ఏడాది పాన్ ఇండియా లెవెల్ లో బాక్స్ ఆఫీస్ ని ఒక ఊపు ఊపేసిన ‘కాంతారా’ మూవీ క్లైమాక్స్ ని ఆదర్శంగా తీసుకొని తెరకెక్కించారనే టాక్ కూడా సోషల్ మీడియా లో వినిపిస్తుంది. ఆ సన్నివేశం మొత్తం చూస్తున్నప్పుడు కాంతారా క్లైమాక్స్ మాత్రమే మా దృష్టిలోకి వచ్చిందని కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఆ ఛాయలు ఉన్నప్పటికీ అంతకు మించి ఈ సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించారని అంటున్నారు. నాని నట విశ్వరూపం ఈ క్లైమాక్స్ సన్నివేశం లో కనిపించిందని, ఇది ఆయన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు నెటిజెన్స్. మంచి పాజిటివ్ టాక్ తో రన్ అవుతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ సృష్టించబోతుందో చూడాలి.