
Nandamuri Balakrishna Help: నందమూరి నటసింహం బాలయ్య మాట కొంచెం కరుకు. మనసు మాత్రం వెన్న. బాలయ్యది చిన్నపిల్లల మనస్తత్వమని ఆయనతో జర్నీ చేసినవారు చెబుతారు. పైకి గంభీరంగా కనిపించే బాలయ్యలో మంచి మనసు, దయార్థ హృదయం ఉన్నాయని మరోసారి రుజువైంది. ఏకంగా రూ. 40 లక్షల విలువ చేసే వైద్యం తన ఆసుపత్రిలో ఉచితంగా చేయించి ఔదార్యం చాటుకున్నాడు. దర్శకుడు బోయపాటి శ్రీను వద్ద అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తి బ్రెయిన్ ట్యూమర్ బారినపడ్డారు. వైద్యం చాలా కాస్లీ కావడంతో కుటుంబ భరించలేని పరిస్థితి. ఈ క్రమంలో తమ సమస్య బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు.
బాలయ్య వెంటనే స్పందించారు. నేను చూసుకుంటానని హామీ ఇచ్చారు.బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో బ్రెయిన్ ట్యూమర్ కి ఆపరేషన్ ఏర్పాటు చేశారు.ఖరీదైన వైద్యాన్ని తన ఆసుపత్రిలో ఉచితంగా అసిస్టెంట్ డైరెక్టర్ కి అందజేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో బాలయ్య భేష్ అంటూ జనాలు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆయన గొప్పవారంటూ కొనియాడుతున్నారు. ఫ్యాన్స్ అయితే మా హీరో గ్రేట్ అంటూ కాలర్ ఎగరేస్తున్నారు.
ఇక బాలయ్య సక్సెస్ ట్రాక్ ఎక్కారు. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలతో ఆయన బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చారు. అఖండ రూ. 120 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. దర్శకుడు బోయపాటి మరోసారి ఫ్యాన్స్ నమ్మకం నిలబెట్టుకున్నారు. పరాజయాలతో ఇబ్బందిపడుతున్న బాలయ్యకు మెమరబుల్ హిట్ ఇచ్చారు. 2021 అతిపెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అఖండ నిలిచింది. ఇక సంక్రాంతి కానుకగా విడుదలైన వీరసింహారెడ్డి హిట్ స్టేటస్ అందుకుంది. గోపీచంద్ మలినేని ఫ్యాక్షన్ నేపథ్యంలో యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు.

ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడితో 108వ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం తెలంగాణ నేపథ్యంలో సాగనుందని అనిల్ రావిపూడి స్వయంగా క్లారిటీ ఇచ్చారు. కాజల్ అగర్వాల్ మొదటిసారి బాలయ్యతో జతకడుతున్నారు. యంగ్ బ్యూటీ శ్రీలీల కీలక రోల్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒక షెడ్యూల్స్ పూర్తి చేసినట్లు సమాచారం. తారకరత్న అనారోగ్యంతో బాధపడుతుండగా స్వల్ప విరామం తీసుకున్నారట. బాలయ్య 108వ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.