Naked Photo Shoot: విదేశీయులకు పొట్టి దుస్తులతో తిరగడం అలవాటు. సముద్రం ఒడ్డున వారు కురుచటి బట్టలు వేసుకుని దర్శనం ఇస్తుంటారు. వారు ఏదైనా కార్యక్రమం చేయాలన్నా వినూత్నంగా ఆలోచించడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఆస్ట్రేలియాలో చర్మ క్యాన్సర్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో ఆస్ట్రేలియా వాసులు పడుతున్న వేదన నుంచి వారిని బయట పడేసేందుకు పలు రకాల కార్యక్రమాలు చేస్తున్నా ఆ వ్యాధి తగ్గడం లేదు. ప్రజలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా వారిలో కనువిప్పు కలిగించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు.

ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని బాండీ బీచ్ లో ఇవాళ ఉదయం 2500 మంది నగ్నంగా ఫొటో షూట్ లో పాల్గొని సంచలనం కలిగించారు. అందరు బట్టల్లేకుండా కనిపించి ఆశ్చర్యం కలిగించారు. ఆస్ట్రేలియాలో 70 సంవత్సరాల లోపు వారికి చర్మ క్యాన్సర్ వ్యాపిస్తోంది. దీంతో వారి ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. వారికి అవగాహన కలిగించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఫొటో షూట్ కు విశేష స్పందన లభించింది. వేలాదిగా తరలివచ్చిన జనంతో బీచ్ సందడిగా మారింది.
అమెరికాకు చెందిన ఫొటోగ్రాఫర్ స్పెన్సర్ బునిక్ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం విశేషం. దీంతో ఆస్ట్రేలియా వాసులు చర్మ క్యాన్సర్ నుంచి బయటపడతారో లేదో తెలియదు కానీ వారి కోసం నగ్నంగా అంత మంది ఒకే చోట చేరడం సంచలనం సృష్టించింది. అంతమంది బట్టలు వదిలేసి ఉండటంతో బీచ్ ఉన్న వారు ఆలోచనలో పడ్డారు. చర్మ క్యాన్సర్ ఇంత బాధిస్తుందా అని వారిలో ఆలోచనలు మొదలయ్యాయి. మొత్తానికి ఆస్ట్రేలియా వాసులు ఏది చేసినా సంచలనమే.

వారి వింతైన చేష్టలకు అందరు ముక్కున వేలేసుకుంటారు. 2500 మంది ఒకేసారి బట్టలు విప్పేసి తిరగడం గమనార్హం. స్కిన్ క్యాన్సర్ నిర్మూలించే క్రమంలో భవిష్యత్ లో మరిన్ని కార్యక్రమాలు ఇలాంటివి చేపడతారనే వాదనలు కూడా వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కు మందు లేకపోవడంతో దాని ప్రభావం విస్తృతంగానే ఉంటోంది. ఈ నేపథ్యంలోనే క్యాన్సర్ కారకంతో చాలా మంది బాధ్యులవుతున్నారు. దీంతోనే చర్మక్యాన్సర్ ను నిర్మూలించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు.