Viral News: మనసుంటే మార్గముంటుంది అంటారు. ప్రపంచంలో ఏదీ కూడా వృథాగా పోదు. ఆలోచిస్తే ఎంత చిన్నదైనా ఎంతో పెద్ద ప్రయోజనం కలిగిస్తుంది. ఆంగ్లంలో ఓ సామెత ఉంటుంది. ఎ స్మాల్ కీ ఓపెన్ ద బిగ్ డోర్. ఎంత పెద్ద తలుపునైనా చిన్న తాళం చెవితోనే తెరుస్తాం. అలా మనకు ఉన్న వనరుల్లో సరిగా వాడుకుంటే ఏదైనా మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం భూముల విలువ ఎంత పెరిగిందో తెలిసిందే. గుంట స్థలం కావాలన్నా రూ. లక్షలు కావాల్సిందే. దీంతో పట్టణవాసం అత్యంత ఖరీదుగా మారింది. దీంతో నగరంలో స్థలం దొరకాలంటేనే గగనంగా మారుతోంది. హైదరాబాద్ లాంటి చోట్ల స్థలం కొని ఇల్లు కట్టాలంటే మాటలు కాదు. దానికి చాలా డబ్బు కావాలి.

ఈ నేపథ్యంలో నగరంలోని హయత్ నగర్ మండలం కుంట్లూరులో ఓ యజమాని తనకున్న స్థలాన్ని విక్రయించగా ఓ 8.8 గజాల స్థలం మిగిలింది. దాన్ని ఏం చేయాలో అర్థం కాకపోవడంతో వట్టిగా ఉంచడమెందుకని ఓ భవనం నిర్మించాలని ప్లాన్ చేశాడు. ఆ స్థలంలోనే రెండంతస్తుల భవనం నిర్మించి ఔరా అనిపించుకుంటున్నాడు. అందరు గుంట స్థలమైనా చాలదని భావిస్తున్న నేపథ్యంలో అతడు మాత్రం 8.8 గజాల్లోనే రెండంతస్తులు నిర్మించడం అందరిలో ఆలోచనలు రేపాడు. ఇంత చిన్న స్థలంలో అంత పెద్ద భవనం నిర్మించవచ్చనే విషయం చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు.
గ్రౌండ్ ఫ్లోర్ లో ఓ కార్యాలయం, పైన అటాచ్ డ్ బాత్ రూం కట్టి అద్దెకు ఇచ్చాడు. ఒక వైపు నుంచి చూస్తే ఆ భవనం ఓ ప్రహరీ గోడలా కనిపిస్తుంది. కానీ అందులో రెండు అంతస్తులు కట్టడం అతడికే చెల్లింది. ఏ ప్లాన్ తో కట్టాడో కానీ అందరు దాన్ని చూసి మురిసిపోతున్నారు. ఇంత చిన్న స్థలంలో ఇంత పెద్ద భవనం నిర్మించడం అతడికే చెల్లిందని కితాబిస్తున్నారు. అతడి తెలివికి అందరు ఫిదా అవుతున్నారు. స్థలమెంతైనా ఆలోచన ఉంటే దాన్ని అమలు చేయడం పెద్ద విషయమేమీ కాదని నిరూపించాడు.

స్థలానికి డబ్బులు విపరీతంగా పెరిగిన సందర్భంలో అతడు కట్టిన విధానం అందరికి వింతగా కనిపిస్తోంది. ఎంత చిన్న స్థలమైనా సరే వృథాగా పోనివ్వకుండా చేసుకోవడంలో అతడు సాఫల్యం పొందాడు. తనకున్న చిన్న స్థలాన్ని కూడా వట్టిగా ఉంచకుండా దాంతో కూడా ఎంతో కొంత మేలు కలగాలనే తలపు మంచిదే. మనం కూడా మనకు స్థలం లేదని బాధపడేకంటే ఉన్న దాంట్లో మంచిగా కట్టుకుని హాయిగా జీవితం గడపొచ్చు. పొదుపుతోనే అన్ని అదుపులో ఉంచుకోవచ్చు. మొత్తానికి అతడు కట్టిన విధానం అందరిలో కొత్త కొత్త ఆలోచలకు కేంద్రంగా మారుతోంది.