Jabardasth Auto Ram Prasad: జబర్దస్త్ కామెడీ త్రయంలో ఆటో రామ్ ప్రసాద్ తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనులతో కలిసి జబర్దస్త్ వేదికపై నాన్ స్టాప్ నవ్వులు కురిపిస్తాడు. సుడిగాలి సుధీర్ టీం కి ఆటో పంచ్ లతో కూడిన స్కిట్స్ రాసేది రామ్ ప్రసాదే. దీంతో ఆటో రామ్ ప్రసాద్ కంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. కాగా రామ్ ప్రసాద్ ఆరోగ్యంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అతడి తలకు సర్జరీ జరిగిందన్న ప్రచారం జరుగుతుంది. తాజాగా బయటికొచ్చిన కొన్ని ఫోటోలు అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి.

సుడిగాలి సుధీర్ నటించిన గాలోడు చిత్ర ప్రమోషన్స్ లో జబర్దస్త్ టీం మొత్తం పాల్గొన్నారు. తన మిత్రుడు సుధీర్ సినిమాకు ప్రచారం కల్పించేందుకు సహకారం అందించారు. గాలోడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ ప్రసాద్ మిస్ అయ్యాడు. అయితే ఫోన్ చేసి సుధీర్ కి విషెస్ తెలియజేశాడు. రామ్ ప్రసాద్ తలకు సర్జరీ అయ్యింది. ఆ కారణంతోనే రాలేకపోయాడని గెటప్ శ్రీను చెప్పాడు. తాజాగా రామ్ ప్రసాద్ తలను కవర్ చేసుకొని దిగిన ఫోటో బయటకు వచ్చింది. ఆ ఫోటో చూసిన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రామ్ ప్రసాద్ తలకు ఏమైంది? సర్జరీ అయితే, అది ఎలాంటి సర్జరీ?అని ఆందోళన చెందుతున్నారు. రామ్ ప్రసాద్ ఆరోగ్యంపై మాత్రం పూర్తి సమాచారం లేదు. ఆ మధ్య జబర్దస్త్ ని సుధీర్, గెటప్ శ్రీను వదిలిపోయారు. దీంతో సుడిగాలి సుధీర్ టీమ్ లో రామ్ ప్రసాద్ ఒంటరి అయ్యాడు. వారిద్దరు లేకుండా స్కిట్స్ చేయడం చాలా కష్టంగా ఉందని రామ్ ప్రసాద్ ఎమోషనల్ అయ్యాడు. స్కిట్ రాయడం, కొత్త వాళ్లతో ప్రాక్టీస్ చేయడం ఇబ్బంది పెడుతుందన్నారు. సుధీర్, గెటప్ శ్రీనులతో నా పని చాలా సులభం అన్నాడు.

గెటప్ శ్రీను తిరిగి జబర్దస్త్ కి వచ్చాడు. అతడు సుడిగాలి సుధీర్ టీమ్ లో స్కిట్స్ చేస్తున్నాడు. సుధీర్ సైతం త్వరలో రీ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఈ ముగ్గురి కలిసి స్కిట్స్ చేయాలని జబర్దస్త్ ఆడియన్స్ కోరుకుంటున్నారు. సుడిగాలి సుధీర్ గాలోడు మూవీ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు మంచి వసూళ్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో హీరోగా బిజీ అవుతాడా? లేక బుల్లితెర షోస్ కూడా చేస్తాడా? అనేది చూడాలి. కాగా సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ కలిసి 3 మంకీస్ టైటిల్ తో ఓ మూవీ చేశారు.