Akshay Bachu: అక్కినేని నాగార్జునకు ఆల్ రెడీ ఇద్దరు కొడుకులు.. అందులో పెద్దోడు నాగచైతన్య , చిన్నోడు అఖిల్ ఇద్దరూ తెలుసు.. మరి ఇంకో కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడని మీ డౌట్ కదా..? నాగార్జున రియల్ కొడుకుల గురించి ఇక్కడ మేం చెప్పడం లేదు.. రీల్ కొడుకుల గురించే చెబుతున్నాం.. 2002లో నాగార్జున హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ ‘సంతోషం’లో నాగార్జున కొడుకుగా నటించిన చిన్న క్యూట్ బుడ్డోడి గురించే మేం చెప్పేది.
సోడాబుడ్డి కళ్లద్దాలతో లడ్డుగా బొద్దుగా కనిపించే ఈ బుడ్డోడు అందరికీ ఆ సినిమాతో గుర్తిండిపోయాడు. ఈ బుడ్డోడు టాలీవుడ్ లోనే కాదు.. అప్పట్లో బాలీవుడ్ లోనూ కొన్ని సినిమాలు, సీరియల్స్ లో బాలనటుడిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ప్రభాస్ సూపర్ హిట్ మూవీ ‘వర్షం’లోనూ నటించాడు.
ఓ హిందీ సినిమాలో ఈ బుడ్డోడి నటన చూసిన నాగార్జున ‘సంతోషం’ సినిమాలో ఛాన్స్ ఇప్పించాడు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ బుడ్డోడి పేరు మారుమోగింది. ఇంతకీ ఎవరీ కుర్రాడు.. అతడి పేరు ఏంటన్నది అందరూ వెతకడం మొదలుపెట్టారు.
Also Read: యాంకర్ సుమ రేర్ ఫొటోలు మీకోసం.. చిన్నప్పుడు, పెండ్లిలో ఎలా ఉందో చూడండి..!
ఈ పిల్లాడి పేరు ‘అక్షయ్ బచ్చు’. ఇప్పుడు యువకుడు అయిపోయాడు. ఆ చిత్రాల తర్వాత తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పిన అక్షయ్ చదువుల మీద దృష్టి సారించాడు. ప్రస్తుతం బాలీవుడ్ లోనే సెటిల్ అయ్యాడు. ఇక అక్కడ యువకుడిగా పలు సినిమాలు, సీరియల్స్ లో నటిస్తున్నాడు.
బాలీవుడ్ లో 12 సినిమాల్లో బాలనటుడిగా చేసిన అక్షయ్.. దాదాపు 45కు పైగా యాడ్ ఫిలింస్ లో నటించి బాగా పాపులర్ అయ్యాడు.
Also Read: ఈవీవీ లైఫ్ లో ఈ బ్లాక్ బస్టర్ మూవీ బడ్జెట్ కేవలం రూ.50 లక్షలు… వచ్చింది 2 కోట్లు.. ఏదో తెలుసా?