Durga Matha: మన భారతదేశం ఎన్నో పురాతన ఆలయాలకు పుట్టినిల్లు అని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఎంతో అతి పురాతనమైన ఆలయాలు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఇలా కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఆలయాలు ఇప్పటికీ ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఉన్నాయి.ఈ క్రమంలోనే ఇలాంటి పురాతన చరిత్ర కలిగిన ఆలయాలను సందర్శించడం కోసం దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయాలను సందర్శిస్తుంటారు. ఈ క్రమంలోని వేయి సంవత్సరాల క్రితం నిర్మించబడిన దుర్గామాత ఆలయం కూడా ఇలాంటి కోవకు చెందుతుంది. మరి ఈ దుర్గామాత ఆలయం ఎక్కడ ఉంది ఈ ఆలయ విశిష్టతలు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…
Also Read: చిక్కుల్లో మంత్రి అప్పలరాజు.. పోలీసు అధికారిపై దుర్భషలాడటంపై సర్వత్రా విమర్శలు..!
బీహార్ రాష్ట్రంలోని కైమూర్ జిల్లా గౌరవ అనే ప్రాంతంలో ముండేశ్వరి అనే దుర్గ మాత ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. వారణాసి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని సుమారు మూడవ శతాబ్దంలో నిర్మించినట్లు ఈ ఆలయ ప్రాంతంలో 625 కాలం నాటి శాసనాలు బయటపడటంతో తెలుస్తోంది.ఈ ఆలయంలో కేవలం దుర్గామాత మాత్రమే కాకుండా శివుడు మహావిష్ణువు కూడా కొలువై ఉన్నారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా నిర్మించిన దుర్గామాత ఆలయమే ముండేశ్వరి ఆలయం.ఈ ఆలయం ముండేశ్వరి అనే పర్వతం పై ఉండటం వల్ల ఈ ఆలయానికి ముండేశ్వరి ఆలయం అనే పేరు వచ్చింది.
ఈ ఆలయంలో అమ్మవారు ఏకంగా పది చేతులతో ఎద్దు పై కొలువై ఉండి మహిషాసురమర్ధిని రూపంలో భక్తులకు దర్శనమిస్తారు.ఈ ఆలయంలోని అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ఏ విధమైనటువంటి కోరికలైనా వెంటనే నెరవేరుతాయని అక్కడి భక్తుల విశ్వాసం. అందుకే ఈ ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. నిత్యం పెద్ద ఎత్తున భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి అమ్మవారి దర్శనం చేసుకుంటారు.అలాగే ఎంతో పురాతనమైన ఈ ఆలయాలను సందర్శించడానికి దేశ విదేశాల నుంచి కూడా యాత్రికులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు.
Also Read: వైరల్ గా మారిన ఐఏఎస్ ప్రేమ.. స్కూల్ టీచర్ తో ఇలా..!