Viral: మనదేశంలో నిరుద్యోగం ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో ఉద్యోగాల వేటలో యువత ఎంతో వ్యయప్రయాసలు పడుతున్నారు. ఏ చిన్న ఉద్యోగం కనిపించినా దానికి దరఖాస్తు చేసుకుని ఇంటర్వ్యూలను ఫేస్ చేస్తుంటారు. మన దేశ పరిస్థితుల ప్రభావం కారణంగా జనాభా విపరీతంగా పెరగడంతో నిరుద్యోగం నివురుగప్పిన నిప్పులా వ్యాపిస్తోంది. ఫలితంగా ఉపాధి అవకాశాలు యువతకు అందకుండా పోతున్నాయి. దీంతో వారు ఏం చేయాలో అర్థం కాక ఎదురయ్యే అన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని ఇంటర్వ్యూ చేయడమే వారి ప్రధాన విధిగా మారుతోంది. ఎంతో మంది ఉద్యోగాల వేటలో తిరుగుతూ చివరకు ఏదో ఒక కూలిపని అయినా చేసేందుకు సిద్ధపడుతున్నారు.

ఇంటర్వ్యూ విషయంలో అడిగే ప్రశ్నలకు ఉద్యోగానికి ఏ మాత్రం సంబంధం ఉండదు. ఇష్టమొచ్చిన రీతిలో ప్రశ్నలు అడుగుతూ చిరాకు తెప్పిస్తుంటారు ఒక దశలో ఫైల్ విసరగొట్టి వారిని చెడామడా తిట్టే సంఘటనలు సైతం లేకపోలేదు. మన నిరుద్యోగం వారికి సరదాగా తోస్తుంది. అందుకే లెక్కలేని ప్రశ్నలు అడుగుతూ చిక్కులు వచ్చేలా చేస్తారు .మన దేశంలో ఇంటర్వ్యూ ఇలాగే చేయాలనే నిబంధన లేకపోవడంతో రెచ్చిపోతుంటారు. కానీ అమెరికాలో అలా కాదు. అక్కడ కొన్ని ప్రశ్నలు అడిగితే వారు జైలుకు వెళ్లాల్సిందే.
అవి ఏంటంటే పెళ్లయిందా? లేదా?, అభ్యర్థి వయసు, అమెరికా పౌరులేనా?, మీరు గర్భవతా?, మతానికి సంబంధించి ప్రశ్నలు అడగరాదు. ఒకవేళ అడిగినట్లయితే ఇంటర్వ్యూ ఫేస్ చేసే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు చట్టపరంగా శిక్షార్హులవుతారు. అది అమెరికాలో ఉన్న రూల్. కానీ ఈ విషయాలేవి ఎవరికి తెలియవు. అందుకే వారికి అవగాహన లేక ఫిర్యాదు చేయడం లేదు. లేదంటే ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి కటకటాలే. ఊచలు లెక్కపెట్టుకోవడమే.
ఇంటర్వ్యూ చేసే సమయంలో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలు అడగరాదనే నిబంధన అక్కడ ఉంది. అందుకే ఇంటర్వ్యూ సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. వివాహమైందా? కాలేదా? అని అడరాదు. అది వ్యక్తిగత విషయం కనుక అటువంటి ప్రశ్నలు సంధించరాదు. వయసుకు సంబంధించిన ప్రశ్న కూడా వేయరాదు. ఎందుకంటే అభ్యర్థి వయసుతో పనిలేదు. ఆ ఉద్యోగానికి వారు అర్హులా కాదా అనేది తేల్చుకోవాలి కానీ వయసు గురించి ఎలాంటి ప్రశ్నలు అడగకూడదు.
పౌరసత్వం మీద క్వశ్చన్ ఉండకూడదు. వారు ఏ దేశ పౌరులైనా అమెరికాలో ఉద్యోగం చేయడానికి అర్హులైతే తీసుకోవాలి. లేదంటే కాదని చెప్పాలి. అంతేకాని జాతివివక్ష చూపించి వారి వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించకూడదు. అందుకే మీరు అమెరికనా కాదా లాంటి ప్రశ్నలు నిషేధం. ఇక ఆడవారినైతే మీరు గర్భవతా అని కూడా ప్రశ్నించొద్దు. ఒకవేళ ఆమె సెలవులు పెడితేనే అప్పుడు కన్ఫార్మ్ చేసుకోవాలి తప్ప ఉద్యోగంలో చేరే ముందే మీరు గర్భవతా అనే ప్రశ్న పనికిరాదు.
ఇక మతానికి సంబంధించిన ప్రశ్నలు కూడా నిషిద్ధమే. ఎప్పుడు కూడా అభ్యర్థి మతంతో కంపెనీకి పని లేదు. అతడు ఏ మతం వాడైనా పనిచేసే వ్యక్తికే ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ అతడి మతాన్ని ప్రామాణికంగా తీసుకోరు. అందుకే అమెరికా అంతలా అభివృద్ధి చెందింది. మన దేశం ఇంకా మతం విషయంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ నిత్యం వివాదాల్లోనే ఉండటం తెలిసిందే. కానీ అక్కడ మాత్రం మతం అనేది సమస్యే కాదు. ఇంటర్వ్యూల్లో ఇలాంటి ప్రశ్నలు వేస్తే వారికి జైలు శిక్ష ఖరారే. అందుకే ఇంటర్వ్యూ చేసే వారు జాగ్రత్తగా వ్యవహరించి వారి నుంచి సమాధానాలు తీసుకుని వారు అర్హులా? కాదా? అనే విషయాలు తెలుసుకుంటారు. కానీ మనదేశంలో లాగా విచిత్ర ప్రశ్నలు వేసి అభ్యర్థులను తికమకపెట్టరు.