https://oktelugu.com/

Spain: కొడుకు వీర్యంతో బిడ్డను కన్న తల్లి..!

స్పెయిన్‌ దేశానికి చెందిన ఒకప్పటి నటి అనా బ్రెగాన్‌ వయసు ప్రస్తుతం 69 ఏళ్లు. గతంలో ఆమెకు అలెస్‌ లెక్వియో అనే కొడుకు ఉండేవాడు. అతను 27 ఏళ్ల వయసులోనే క్యాన్సర్‌తో మరణించాడు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : April 13, 2024 / 11:03 AM IST

    Spain

    Follow us on

    Spain: తల్లి కొడుకుల బంధం వెలకట్టలేనిది. మాతృత్వాన్ని ఎన్ని కోట్లు ఇచ్చినా పొందలేనిది. సమాజంలో తల్లి కొడుకుల బంధాన్నికి గౌరవం ఉంది. అయితే ఓ తల్లి తన కొడుకు వీర్యంతోనే బిడ్డను కనడం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రీజ్‌ చేసిన తన కొడుకు వీర్యాన్ని ఉపయోగించి సరోగసి ద్వారా అతని తల్లి ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. తాను తన కొడుకు వీర్యంతో బిడ్డను కన్నానని ప్రకటించి ప్రపంచం నివ్వెరపోయేలా చేసింది.

    ఏం జరిగిందంటే..
    స్పెయిన్‌ దేశానికి చెందిన ఒకప్పటి నటి అనా బ్రెగాన్‌ వయసు ప్రస్తుతం 69 ఏళ్లు. గతంలో ఆమెకు అలెస్‌ లెక్వియో అనే కొడుకు ఉండేవాడు. అతను 27 ఏళ్ల వయసులోనే క్యాన్సర్‌తో మరణించాడు. అయితే మరణానికి ముందు అలెస్‌కు తండ్రి కావాలన్న కోరిక బలంగా ఉండేది. దీంతో తన వీర్యాన్ని నిల్వ చేసి పెట్టాడు. కానీ, అలెస్‌ ఒకటి తలిస్తే విధి మరొకటి తలచింది. వీర్యాన్ని ఓ పెంటర్‌లో భద్రపర్చిన తర్వాత అతడు క్యాన్సర్‌ బారిన పడ్డాడు. కొన్నాళ్లకు మరణించాడు.

    ఇటీవలే విషయం తెలుసుకున్న తల్లి..
    అయితే తండ్రి కావాలన్న ఆశతో అఎస్‌ లెక్వియో తన వీర్యాన్ని భద్రపర్చిన విషయం ఇంట్లో లభించిన రశీదు ఆధారంగా అతని తల్లి అనా ఓబ్రెగాన్‌ తెలుసుకుంది. దీంతో తన కొడుకు కోరిక నెరవేర్చాలనుకుంది. కొడుకు ఆఖరి కోరిక తీర్చేందుకు తన ప్రాణాలను కూడా పణంగా పెట్టింది. ఆరు పదులు దాటిన వయసులో సరోగసి ద్వారా తల్లి కావాలనుకుంది. ఈమూనే 2023లో వైద్యులను సంప్రదించింది. వారు సరోగసికీ ఓబ్రెగాన్‌ శరీరం సహకరిస్తుందని గుర్తించారు. అయితే కొన్ని కండీషన్ల మేరకు సరోగసీకి అంగీకరించారు. దీంతో ఫ్రీజ్‌ చేసిన తన కొడుకు వీర్య కణాలను ఓబ్రెగాన్‌ గర్భంలో ప్రవేశపెట్టారు. ఈ పద్ధతిలో ఆమె ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది. తాజాగా ఆ విషయాన్ని బయటపెట్టింది.