https://oktelugu.com/

America: అమెరికాలో మన విద్యార్థుల పరిస్థితి దారుణం.. ఏమైందంటే?

లక్షల్లో అప్పులు చేసి అమెరికా ఫ్లైట్‌ ఎక్కిన విద్యార్థులు ఇప్పుడు హెచ్‌1బీ వీసాలు తిరస్కరణకు గురికావడంతో కుంగిపోతున్నారు. దరఖాస్తులు తీసుకున్న విద్యార్థులు కూడా త్వరలో ఉద్యోగంలో చేరాల్సి రావడంతో సంతోషించలేకపోతున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : April 13, 2024 11:09 am
    America

    America

    Follow us on

    America: వచ్చే 2025 ఆర్థిక సంవత్సరం కోసం లాటరీ విధానంలో తమ దరఖాస్తులను దాఖలు చేసిన హెచ్‌1బీ దరఖాస్తు దారులకు యూఎస్‌సీఐఎస్‌(USCIS) షాక్‌ ఇచ్చింది. దరఖాస్తు దారులకు డ్రా పద్ధతిలో ఎంపిక చేసిన వివరాలు, తిరస్కరించిన వివరాలను మెయిల్‌ ద్వారా పంపించింది. దీంతో ఎంపిక కానివారు ఆందోళన చెందుతున్నారు. యూఎస్‌సీఐఎస్‌ తగిన సంఖ్యలో పిటిషన్లు స్వీకరించింది. అయితే 65 వేల హెచ్‌1బీ వీసాలలో ఎంఎస్‌ విద్యార్థులకు 20 వేలు మాత్రమే కేటాయించారు. చాలా మంది తిరస్కరణకు గురయ్యారు. తర్వాత ఏం చేయాలో తెలియ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కళాశాలల కోసం పెద్దమొత్తంలో డబ్బులు ఖర్చు చేశారు. ఇప్పుడు వీసా రాకపోవడంతో చదువులను పొడిగించుకోవడానికి ఎక్కువ డబ్బులు తీసుకురావడంతోపాటు హెచ్‌1బీ వీసా కోసం వచ్చే ఏడాది వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

    వచ్చే ఏడాది వస్తుందా?
    ఇక ఈ ఏడాది తిరస్కరణకు గురైన వారికి వచ్చే ఏడాది వస్తుందా అంటే గ్యారంటీ లేదు. ఎందుకంటే వచ్చే ఏడాది ఆ ఏడాదికి సంబంధించి కొత్త దరఖాస్తులతోపాటు తిరస్కరణకు గురైనవారు పోటీ పడతారు. మళ్లీ డ్రా పద్ధతిలోనే ఎంపిక చేయనున్న నేపథ్యంలో ఎవరికి వీసా వస్తుందనేది చెప్పలేం. కోవిడ్‌ తర్వాత విద్యార్థుల విదేశీ చదువుల అవసరాన్ని సొమ్ము చేసుకున్న అమెరికా ప్రతీ విద్యార్థికి వీసా జారీ చేసింది. కానీ ఇప్పుడు నిబంధనలు కఠినతరం చేసింది. వీసాలను పరిమితం చేసింది.

    కుంగిపోతున్న విద్యార్థులు..
    లక్షల్లో అప్పులు చేసి అమెరికా ఫ్లైట్‌ ఎక్కిన విద్యార్థులు ఇప్పుడు హెచ్‌1బీ వీసాలు తిరస్కరణకు గురికావడంతో కుంగిపోతున్నారు. దరఖాస్తులు తీసుకున్న విద్యార్థులు కూడా త్వరలో ఉద్యోగంలో చేరాల్సి రావడంతో సంతోషించలేకపోతున్నారు. వారు నిరంతర పేరోల్‌ను చూపించాలి. లేదంటే రెన్యూవల్స్‌ కోసం వెళ్లినప్పుడు భవిష్యత్తులో తిరస్కరణలను ఎదుర్కొంటారు.

    పెద్ద యూనివర్సిటీల విద్యార్థులు కూడా..
    ఇక బాధాకరమైన విషయం ఏమిటంటే వీసా తిరస్కరణకు గురైన వారిలో హార్వర్డ్‌ యూనివర్సిటీ వంటి పెద్ద యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఉన్నారు. చాలా మంది భారతీయ విద్యార్థులు వీసా రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అయితే తిరస్కరణకు గురైనవారు అక్కడ ఉద్యోగం పొందితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ, అంత త్వరగా ఉద్యోగం దొరకడం కూడా కష్టమే.

    హెచ్‌1బీ వచ్చినా కూడా..
    ఇదిల ఉంటే హెచ్‌1బీ వీసా వచ్చిన తర్వాత కూడా అవాంతరాలు ఉండవన్న గ్యారంటీ లేదు. బ్యాక్‌లాగ్‌ ఎలా ఉందో చూస్తే గ్రీన్‌కార్డు పొందడం ఆచరణాత్మకంగా అసాధ్యం. 1980లలో పుట్టిన బ్యాక్‌లాగ్‌లో అత్యధికులు 85 శాతం మంది భారత దేశానికి చెందినవారేనని నివేదికలు చెబుతున్నాయి. 1970లు మరియు 1960లలో జన్మించిన భారతీయులలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఇప్పటికీ వెనుకబడి ఉన్నారు.

    యూఎస్‌ రావొద్దని సూచన..
    మాస్టర్‌ తర్వాత సంతోషకరమైన జీవితం గురించి కలలు కంటూ హ్యాపీగా యూఎస్‌ వచ్చినవారు కొత్తగా వచ్చే వారు రావొద్దని ఇండియాలోని తమ స్నేహితులకు సూచిస్తున్నారు. మొదట్లో, భారతదేశంలోని చాలా మంది మాతృ సమాజం మరియు విద్యార్థులు ఈ సలహాను పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు వారు కూడా కఠినమైన వాస్తవికత యొక్క తీవ్రతను అర్థం చేసుకోవడం ప్రారంభించారు.