
Mohan Babu- Manchu Manoj Second Marriage: ఈమధ్య మోహన్ బాబు రెండవ కొడుకు మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డి ని ప్రేమించి పెళ్లాడిన సంగతి అందరికీ తెలిసిందే. హంగులు , ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్ గా ఆయన తన అక్క మంచు లక్ష్మి ప్రసన్న ఇంట్లో వివాహం చేసుకున్నాడు. మనోజ్ కి అత్యంత సన్నిహితమైన కొంతమంది స్నేహితులు మరియు బంధువుల మధ్య ఈ వివాహ మహోత్సవం జరిగింది.
అయితే ఈ పెళ్లి గురించి సోషల్ మీడియా లో ఎన్నో కథనాలు మరియు ఊహాగానాలు వచ్చాయి. వాటి అన్నిటికీ సమాధానం మంచు కుటుంబ సభ్యులు ఎవ్వరూ చెప్పలేదు. పట్టించుకోలేదు కూడా, మోహన్ బాబు కి ఈ పెళ్లి అంటే ఇష్టం లేదని,ఈ విషయం లో గొడవలు అయ్యే మనోజ్ మోహన్ బాబు ఇంటి నుండి విడిపోయి సెపెరేట్ గా ఉంటున్నాడని, ఇలా ఎన్నో రకాల వార్తలు సోషల్ లో ప్రచారం అయ్యాయి. అయితే వీటిపై మోహన్ బాబు సింపుల్ గా ఒకే ఒక్క లైన్ తో తేల్చేసాడు.
రీసెంట్ గా మీ అబ్బాయి మనోజ్ రెండవ పెళ్లి చేసుకున్నాడు కదా,దాని గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడగగా మోహన్ బాబు అందుకు సమాధానం చెప్తూ ‘నాకు మనోజ్ ఈ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని చెప్పి చాలా కాలం అయ్యింది. పెళ్లి చేసుకోబోతున్నాను నాన్న అని అన్నాడు, ఒకసారి ఆలోచించుకో అన్నాను, లేదండి అంతా ఆలోచించాను, ఆ అమ్మాయి నాకు కరెక్ట్ అనిపించింది , నిర్ణయం కూడా తీసేసుకున్నాను అన్నాడు. సరే నీ ఇష్టం ,అల్ ది బెస్ట్ చేసేసుకో అన్నాను’ అంటూ మోహన్ బాబు ఈ సందర్భంగా సమాధానం చెప్పాడు.

ఆ తర్వాత సోషల్ మీడియా లో ఈ పెళ్లి గురించి వచ్చిన రూమర్స్ గురించి అడగగా మోహన్ బాబు అందుకు సమాధానం చెప్పకుండా దాటవేసాడు. సోషల్ మీడియా లో వచ్చే వార్తలను మరియు ట్రోలింగ్స్ ని అసలు ఫాలో అవ్వను అని,ఎవరో చెప్తే వింటాను అంతే అంటూ మోహన్ బాబు వ్యాఖ్యానించాడు.