https://oktelugu.com/

Srikanth Divorce: నా భార్యతో కష్టంగానే కలిసి వెళ్లాల్సి వస్తుంది అంటూ విడాకుల వార్తపై స్పందించిన శ్రీకాంత్

Srikanth Divorce: ఇండస్ట్రీ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా వచ్చి సక్సెస్ అయినా అతి తక్కువమంది హీరోలలో ఒకడు శ్రీకాంత్. ఆరోజుల్లో ఈయనకి యూత్ ,లేడీస్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో మామూలు క్రేజ్ ఉండేది కాదు. వెంకటేష్ మరియు నాగార్జున లాంటి స్టార్స్ తో సమానమైన హోదాని దక్కించుకున్నాడు. అయితే ఎంత పెద్ద స్టార్ అయినా ఎదో ఒక సమయం లో వయస్సు అయ్యినప్పుడు తగ్గిపోవాల్సిందే. అలా శ్రీకాంత్ కి మధ్యలో వరుసగా […]

Written By: , Updated On : March 24, 2023 / 07:36 AM IST
Follow us on

Srikanth Divorce

Srikanth, ooha

Srikanth Divorce: ఇండస్ట్రీ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా వచ్చి సక్సెస్ అయినా అతి తక్కువమంది హీరోలలో ఒకడు శ్రీకాంత్. ఆరోజుల్లో ఈయనకి యూత్ ,లేడీస్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో మామూలు క్రేజ్ ఉండేది కాదు. వెంకటేష్ మరియు నాగార్జున లాంటి స్టార్స్ తో సమానమైన హోదాని దక్కించుకున్నాడు. అయితే ఎంత పెద్ద స్టార్ అయినా ఎదో ఒక సమయం లో వయస్సు అయ్యినప్పుడు తగ్గిపోవాల్సిందే.

అలా శ్రీకాంత్ కి మధ్యలో వరుసగా ఫ్లాప్స్ రావడం వల్ల ఆయన మార్కెట్ మొత్తం పోయింది. ఆ సమయం లో సమయం లో సరైన నిర్ణయం తీసుకొని క్యారక్టర్ ఆర్టిస్టు గా మారిపోయాడు. క్యారక్టర్ ఆర్టిస్టుగా మారిన తర్వాత శ్రీకాంత్ కి ఎన్నో మంచి పాత్రలు పోషించే అవకాశం దక్కింది. ప్రస్తుతం ఆయన నెగటివ్ రోల్స్ లో కూడా గొప్పగానే రాణిస్తున్నాడు, సౌత్ ఇండియాలోనే మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్ అన్నిట్లో శ్రీకాంత్ కి మంచి అవకాశాలు వస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా నిన్న ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఛానల్ లో ఆయన తన జీవితం లో చోటు చేసుకున్న సంఘటనలు మరియు హీరో గా నిలదొక్కుకోవడానికి ఆయన ఇబ్బందులు పడ్డాడో చెప్పుకొచ్చాడు. దాంతో పాటు రీసెంట్ గా ఆయన గురించి సోషల్ మీడియా లో వచ్చిన కొన్ని పుకార్లపై స్పందించాడు.

Srikanth Divorce

Srikanth, ooha

ఆయన మాట్లాడుతూ ‘ఈమధ్య సోషల్ మీడియా లో వస్తున్న కథనాలను గమనిస్తూనే ఉన్నాను, ఒకసారి నేను చనిపోయినట్టు వార్తలు పుట్టించారు, అలాంటివి చూసినప్పుడు మనసుకి చాలా బాధవేస్తుంది. వయసులోకి వచ్చిన నా తల్లితండ్రులు ఇలాంటివి చూస్తే వాళ్లకి గుండెపోటు రావొచ్చు. ఇలాంటి దరిద్రులపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేము, వారిలో వారికే మార్పు రావాలి, మొన్నీమధ్యనే నా భార్య తో నేను విడాకులు తీసుకుంటున్నట్టు పుకార్లు పుట్టించారు. ఆ పుకార్ల దెబ్బకి నేను నా భార్య ఈమధ్య ప్రతీ ఫంక్షన్ కి కలిసి వెళ్లాల్సి వస్తుంది, సాధారణంగా నా భార్య ఫంక్షన్స్ కి రావడానికి పెద్దగా ఇష్టం చూపదు, కానీ బలవంతంగా రావాల్సి వస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు శ్రీకాంత్.