Satya Nadella: బిర్యానీ ఎంటీ.. బ్రేక్‌ఫాస్ట్ ఏంటీ అనుకుంటున్నారా.. నిజమేనండి.. ఓ కంపెనీ మన హైదరాబాద్ బిర్యానీని బ్రేక్‌ఫాస్ట్‌గా మార్చేసింది. బ్రేక్‌ఫాస్ట్ కావాలని అడిగిన మైక్రోసాఫ్ట్ దిగ్గజం, మన తెలుగు బిడ్డ సత్య నాదెళ్లకే ఈ అనుభవం ఎదురైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే చాట్‌బోట్ సాఫ్ట్‌వేర్‌తో ఇటీవల జరిపిన చాట్‌లో ఇడ్లీ, వడ, దోశతోపాటు హైదరాబాద్ బిర్యానీని టిఫిన్‌గా చూపింది సదరు సంస్థ. దీంతో హైదరాబాదీ అయిన సత్య షాక్ అయ్యారు. సంస్థతో సంవాదం పెట్టుకున్నారు. ఈ విషయాన్ని బెంగళూర్‌లో ఆయనే స్వయంగా వెల్లడించారు.

ఫేమస్ మన బిర్యానీనే..
హైదరాబాద్ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే ఫుడ్ బిర్యానీ. దేశవ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీకి పేరుంది. హైదరాబాద్‌కు ఎవరైనా వస్తే.. బిర్యానీ తినకుండా వెళ్లరు. ఎక్కువమంది ఇష్టపడే ఫుడ్‌గా హైదరాబాద్ బిర్యానీ గుర్తింపు పొందింది. ఫుడ్ డెలివరీ యాప్‌లలో కూడా ఎక్కువమంది ఆర్డర్ చేసే ఐటెంగా బిర్యానీ నిలుస్తోంది. దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన హైదరాబాద్ బిర్యానీ గురించి ఇక్కడి ప్రజలు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. హైదరాబాద్‌లో జన్మించిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల కూడా హైదరాబాద్ బిర్యానీ అంటే తనకు ఎంత ఇష్టమో చెప్పేశారు.
సౌత్ ఇండియా టిఫిన్లపై చర్చ
హైదరాబాద్ బిర్యానీని అవమానించిన చాట్‌బాత్‌పై సత్య నాదెళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే చాట్‌బోట్ సాఫ్ట్‌వేర్ అయిన చాట్ జీపీటీతో సత్య నాదెళ్ల ఇటీవల చాట్ నిర్వహించారు. సౌత్ ఇండియాలో పాపులర్ టిఫిన్స్ ఏంటి? అని చాట్ జీపీటీని అడగ్గా.. ఇడ్లీ, వడ, దోసెతోపాటు బిర్యానీని కూడా చూపించింది. దీంతో సత్య నాదెళ్ల సీరియస్ అయ్యారు. బిర్యానీని టిఫిన్‌గా పేర్కొనడం హైదరాబాదీ అయిన తనను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిర్యానీ టిఫిన్ అని చెప్పి హైదరాబాదీని అవమానించలేరని పేర్కొన్నారు. బిర్యానీని సౌత్ ఇండియన్ టిఫిన్‌గా పేర్కొనడం వల్ల ఆ సాఫ్ట్‌వేర్ ఓ హైదరాబాదీ అయిన తన తెలివితేటలను అవమానించిదని అన్నారు.
సారీ చెప్పిన చాట్‌బాత్
సత్య నాదెళ్ల వ్యాఖ్యలతో చాట్ జీపీటీ తన మాటలను వెనక్కి తీసుకుంది. సత్య నాదెళ్లకు వెంటనే క్షమాపణలు చెప్పింది. సత్య నాదెళ్ల చెప్పిన మాట వాస్తవమేనని, సౌత్ ఇండియాలో బిర్యానీని టిఫిన్ డిష్‌గా వర్గీకరించలేదంటూ చాట్‌బాత్ సారీ చెప్పింది. తాజాగా బెంగూళూరులో జరిగిన ఫ్యూచర్ రెడీ టెక్నాలజీ సమ్మిట్‌లో సత్య నాదెళ్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాట్‌బాత్‌తో తనకు ఎదురైన అనుభవాన్ని సత్య నాదెళ్ల పంచుకున్నారు. దీంతో హైదరాబాద్‌లో జన్మించిన సత్య నాదెళ్లకు హైదరాబాద్ బిర్యానీ అంటే ఎంత ఇష్టమే దీని ద్వారా తెలుస్తుందని కొంతమంది నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
చాట్‌బాత్‌లో చర్చ సాగిందిలా..
‘నాకు అత్యంత ప్రజాదరణ పొందిన దక్షిణ భారత టిఫిన్స్ జాబితాను ఇవ్వండి. వెంటనే అతనికి ఈ క్రింది జాబితాను ఇచ్చింది. అందులో ఇడ్లీ, దోసె, వడ, వంటకం, పొంగల్, బిర్యానీ ఉన్నాయి.

స్పందించిన సత్య.. బిర్యానీకి ప్రసిద్ధి చెందిన దక్షిణ భారత నగరమైన హైదరాబాద్‌లో స్పెషల్.. ఇది 55 ఏళ్లగా నాకు తెలుసు.. ‘బిర్యానీ దక్షిణ భారత టిఫిన్ అని నేను అనుకోను’ అని అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో వెంటనే చాట్ జీపీటీ క్షమాపణ చెప్పింది, ‘బిర్యానీ సంప్రదాయ దక్షిణ భారత టిఫిన్ కాదని మీరు చెప్పింది నిజమే. బిర్యానీ అనేది ఒక బియ్యం వంటకం, ఇది భారత ఉపఖండంలో ఉద్భవించిందని నమ్ముతారు. ఇది సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు మరియు మాంసం లేదా సముద్రపు ఆహారంతో తయారు చేయబడింది’ అని పేర్కొంది.
టిఫిన్ బాక్స్ ఉందని టిఫిన్‌గా మార్చేశారు..
సమస్య ఏమిటంటే, కేంబ్రిడ్జ్ ఆన్‌లైన్ డిక్షనరీ ప్రకారం, ‘‘చిన్న భోజనం, ముఖ్యంగా మీరు మధ్యాహ్న భోజనం’’ అనే ప్రాంప్ట్ ‘టిఫిన్’తో ఉంది. ఇది స్పష్టంగా అమెరికన్ టెక్ హోంచో ఉద్దేశ్యం. కానీ భారతదేశంలో బిర్యానీ వడ్డించే లేదా ఇంటికి డెలివరీ చేసే ఏ ప్రదేశంలోనైనా, టిఫిన్ కూడా టిఫిన్ బాక్స్‌తో సంబంధం కలిగి ఉంటుంది, ముఖ్యంగా లంచ్ బాక్స్. టిఫిన్ బాక్స్‌లో ఏదైనా వడ్డించవచ్చు. భారతదేశంలోని మిలియన్ల కొద్దీ రెస్టారెంట్లు టిఫిన్ బాక్స్‌లలో బిర్యానీని అందిస్తున్నాయి. ఈ కారణంగా చాట్‌బాత్ సాఫ్ట్‌వేర్ టిఫిన్ అనే పదం దాని అసలు అర్థం మార్చేసింది. బిర్యానీని టిఫన్ జాబితాలో చేర్చేసింది.