Ram Pothineni: హీరో రామ్ పోతినేని లేటెస్ట్ కామెంట్ అనేక అనుమానాలకు కారణమైంది. ఓ నాలుగైదేళ్ల బాలుడితో పాటు ఫోటో దిగిన రామ్ పోతినేని అది సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దానికి ఆయన ఇచ్చిన కామెంట్… సంచలనంగా మారింది. రామ్ పోతినేనికి పెళ్లీడు వచ్చి చాలా కాలం అవుతుంది. ఆయన ప్రస్తుత వయసు 34 ఏళ్లు. మిగతా యంగ్ హీరోల మాదిరే ఆయన కూడా పెళ్లి మాట ఎత్తడం లేదు. అప్పుడప్పుడు రామ్ వివాహం చేసుకోబోతున్నాడంటూ పుకార్లు వినిపించినా కార్య రూపం దాల్చింది లేదు.

ఇక రామ్ కెరీర్ ఒడిదుడుకులతో సాగుతుంది. చాలా గ్యాప్ తర్వాత ఆయన ఇస్మార్ట్ శంకర్ మూవీతో భారీ హిట్ కొట్టాడు. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఆ మాస్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. వరల్డ్ వైడ్ ఇస్మార్ట్ శంకర్ రూ. 75 కోట్ల గ్రాస్ రాబట్టింది. అయితే వరుసగా రెండు పరాజయాలు ఎదురయ్యాయి. తమిళ రీమేక్ గా తెరకెక్కిన రెడ్ పర్లేదు అనిపించింది. కానీ కమర్షియల్ గా ఆడలేదు. ఇక లేటెస్ట్ రిలీజ్ ది వారియర్ పూర్తిగా నిరాశపరిచింది. తమిళ డైరెక్టర్ లింగుస్వామి తెరకెక్కించిన మాస్ ఎంటర్టైనర్ లో విషయం లేదని జనాలు తేల్చేశారు.
ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. అఖండ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన బోయపాటి మంచి ఫార్మ్ లో ఉన్నాడు. ముఖ్యంగా బాలయ్యను పరాజయాల నుండి బయటపడేసి సక్సెస్ ట్రాక్ ఎక్కించాడు. అలాంటి అత్యవసర విజయం రామ్ పోతినేనికి కూడా కావాలి. బోయపాటితో చేస్తున్న చిత్రం పాన్ ఇండియా మూవీ కాగా… సక్సెస్ కొడితే రామ్ ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆయన మార్కెట్ ఇతర భాషల్లో పెరిగే అవకాశం ఉంటుంది. రామ్ హిందీ డబ్బింగ్ చిత్రాలు యూట్యూబ్ లో విశేష ఆదరణ పొందుతాయి. ఈ క్రమంలో నార్త్ లో రామ్ సినిమా ఆడుతుందని మేకర్స్ నమ్ముతున్నారు.

ఇక రామ్ పెళ్లి బోయపాటి సినిమా తర్వాతే అంటున్నారు. అయితే ఆయన తాజా పోస్ట్ కొత్త అనుమానాలు లేవనెత్తింది. ఒక బాలుడితో పాటు ఫోటో దిగి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోకి ”ఎందుకంటే ఈ రోజు సండే” అని ఇంగ్లీష్ లో కామెంట్ పెట్టాడు. ఆదివారం అనే పదాన్ని ఇంగ్లీష్ లో ‘SON’day అని రాశారు. ‘SON’ అంటే కొడుకు కాబట్టి… పిల్లాడితో ఫోటో దిగి కొడుకు అని కామెంట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో రామ్ కి పెళ్ళై పిల్లాడు కూడా ఉన్నాడా? ఎవరీ సిద్దాంత్? అంటూ పుకార్లు బయలుదేరాయి. అన్న, కజిన్ పిల్లలను కూడా సన్ అంటారు. కాబట్టి సిద్దాంత్ రామ్ కొడుకు అయ్యే ఛాన్స్ లేవంటున్నారు.
Coz it’s a SONday.. #Sidhanthpothineni pic.twitter.com/8hrXNNsjly
— RAm POthineni (@ramsayz) January 8, 2023