Vijayawada Btech Student: ప్రేమ ప్రాణం పోస్తుంది.. అనుబంధాలను పెంచుతుంది.. త్యాగాన్ని కోరుకుంటుంది. కానీ ఇటీవలి ప్రేమే లేని ప్రేమ అనుబంధాలను తెంచుతోంది. ప్రాణాలు తీస్తోంది. హత్యను ప్రేరేపిస్తోంది. చంపాలి, చావాలి అని ఆ ఆన్‌లైన్ గేమ్‌లా మారింది. ప్రేమించడం తప్పు కాదు.. ప్రేమ పేరుతో మోసం చేయడం మాత్రమే తప్పు. ఇది మనసును హర్ట్ చేస్తుంది. దారుణమైన నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తుంది. ఇలా ఓ యువకుడు.. తన లవర్ మోసం చేసిందని ఏకంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన విజయవాడలో జరిగింది.

కన్నీళ్లు తెప్పిస్తున్న సూసైడ్ నోట్..
విజయవాడకు చెందిన బీటెక్ విద్యార్థి అబ్దుల్ సలామ్ సూసైడ్ నోట్ రాసి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు ఆయన రాసిన సూసైడ్ నోట్ కన్నీళ్లు తెప్పిస్తోంది. సుకుమిక అనే యువతి తనను ప్రేమ పేరుతో మోసం చేసిందని సూసైడ్ నోట్ లో సలామ్ రాశాడు. ఓ యువతి ప్రేమించి వంచిందని వాపోయాడు. తనను ప్రేమించిన యువతి ప్రవర్తనలో కొంతకాలంగా మార్పు వచ్చిందని తీరా ఆరా తీస్తే పెళ్లైన వ్యక్తితో న్యూడ్ వీడియో కాల్స్ చేస్తూ రిలేషన్‌లో ఉందని తెలిసిందని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకుంటానని సలామ్ లేఖలో రాసుకున్నాడు. ఆ యువతి ప్రవర్తనలో మార్పు తేవడానికి తాను ఎంతో ప్రయత్నించానని మారలేదని, ఈ కారణంగా తాను కూడా సరిగా చదవలేకపోతున్నానని రాశాడు.
తనది టైంపాస్ ప్రేమ..
అన్నీ వదిలేయమని చెప్పినా తన ప్రియురాలు వినకుండా అర్ధ్థరాత్రుళ్లు మరో వ్యక్తితో వీడియో కాల్స్ మాట్లాడుతుందని సలామ్ ఆవేదన వ్యక్తం చేశాడు. టైమ్‌పాస్ ప్రేమతో తనను పిచ్చివాడ్ని చేసిందన్నాడు. అందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని సలామ్ లెటర్‌లో రాశాడు. తనపై ఫేక్ ప్రేమ నటించిందని తెలిపారు. పెళ్లైన ఓ లెక్చరర్‌తో సంబంధం పెట్టుకుని న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడేదని వెల్లడించాడు. అబ్బాయిలు మోసం చేసే హైలైట్ చేస్తారు.. కానీ అమ్మాయిలు మోసం చేస్తే ఎందుకు ప్రశ్నించరని లేఖలో రాశాడు. మోసపోయిన తనలాంటి అమాయకపు అబ్బాయిలకు న్యాయం చేయాలంటూ సలామ్ లేఖలో కోరారు. జీవితం మీద విరక్తితో తన తల్లిదండ్రులకు సమాధానం చెప్పలేక ఈ నిర్ణయం తీసుకున్నానని వాపోయాడు.

తాను సిన్సియర్‌గా, సీరియస్‌గా లవ్ చేస్తుంటే.. ప్రేయసి మాత్రం టైంపాస్ కోసం, ఎంజాయ్‌మెంట్ కోసం లవ్ చేయడాన్ని అతను జీర్ణించుకోలేకపోయాడు. అతని జీవితంలోకి ఆమె ప్రవేశం చివరకు అతడిని అంతం చేసింది. ప్రేమే లేని ప్రేమ ఇంతటి దారుణానికి కారణమైంది.