Men Domestic Violence: ఇన్నాళ్లు మనం గృహహింసకు స్త్రీలే బలవుతున్నారని చదువుకున్నాం. ఆడవాళ్లే సమిధలుగా మారుతున్నారని విన్నాం. కానీ అది తప్పు. ముమ్మాటికి తప్పు. గృహహింసకు బలవుతోంది స్త్రీలు కాదు పురుషులు. వినడానికి ఇది విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది మమ్మాటికి నిజం. పైగా ఏటికేడు గ్రహీంస వల్ల బలవుతున్న పురుషుల సంఖ్య పెరిగిపోతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. ఈ మరణాలపై అటు ప్రభుత్వం, ఇటు ప్రజాసంఘాలు చొరవ చూపకపోవడంతో ఒక న్యాయవాది తెరపైకి వచ్చారు. స్త్రీల మాదిరిగానే పురుషులను కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన ప్రకటించారు. అంతేకాదు ఏకంగా సుప్రీంకోర్టు తలుపు తట్టారు.
మహేష్ కుమార్ తివారి అనే ఒక న్యాయవాది సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. ” చాలామంది గృహ హింసకు బలవుతోంది స్త్రీలు మాత్రమే అనుకుంటున్నారు. కానీ అది తప్పు. ఆడవాళ్ళ కంటే మగవాళ్ళ మీద దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. సమాజ కూడా స్త్రీ వైపు ఉండటంతో మగవాళ్ళ ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. కనీసం మగవాళ్ళను బాధితులుగా కూడా చూడటం లేదు.. అందువల్లే నేను మగవాళ్ళ రక్షణ కోసం నడుం బిగించాను. స్త్రీల మాదిరే మగవాళ్ళకు కూడా పురుషుల కమిషన్ ఉండాలని డిమాండ్ చేస్తున్నాను. అందువల్లే ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశాను” అని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ ప్రజా ప్రయోజన వాజ్యానికి సంబంధించి స్పందించిన సుప్రీంకోర్టు జూలై మూడున విచారించనుంది. దీనికి సంబంధించిన వివరాలను తన అధికారిక వెబ్ సైట్ లో వెల్లడించింది.
ఇక మహేష్ కుమార్ తివారీ పిల్ గురించి పక్కన పెడితే.. మగవాళ్ళ మీద దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం దేశంలో 1,64,000 మంది ఆత్మహత్యలు చేసుకుంటే.. అందులో 1,10,000 మంది పురుషులే ఉండటం విశేషం. అయితే వీరంతా కూడా గృహహింస సంబంధిత కారణాలవల్ల ఆత్మహత్యలు చేసుకున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. కాలం మారుతున్న నేపథ్యంలో కుటుంబ అవసరాలు పెరిగిపోవడం, ఆర్థికపరమైన ఒత్తిళ్ల వల్ల చాలామంది మగవాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నేషనల్ ప్రైమ్ రికార్డ్స్ బ్యూరో పరిశీలనలో తేలింది. కుటుంబ పరమైన సమస్యలు మగవాళ్లలో ఆత్మ న్యూ నతను పెంచుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మగవాళ్లలో ఆత్మహత్యలు చేసుకునే శాతం పెరుగుతుందని వివరించింది. ఇక వీటిని ఉటంకిస్తూ మహేష్ కుమార్ తివారి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యం చర్చనీయాంశంగా మారింది.