https://oktelugu.com/

Bhavya Bishnoi: సినీ నటి మెహ్రీన్ తో చిక్కబడ లేదు: చివరికి ఐఏఎస్ ఆఫీసర్ తో ముడిపడింది

ఎంగేజ్మెంట్ అయిన కొద్ది రోజులకే మెహరీన్, భవ్య విడిపోయారు.. అభిప్రాయ భేదాలు తలెత్తడంతో పెళ్లి రద్దు చేసుకుంటున్నామని ప్రకటించారు. ఆ తర్వాత వారి వారి వ్యక్తిగత జీవితాల్లో బిజీగా మారిపోయారు. మెహరీన్ హీరో యిన్ గా కంటిన్యూ చేస్తుంటే..

Written By: , Updated On : May 9, 2023 / 11:58 AM IST
Bhavya Bishnoi

Bhavya Bishnoi

Follow us on

Bhavya Bishnoi: ఒక బంధం బలపడాలంటే దానికి చాలా అంశాలు ముడిపడి ఉండాలి. అదే ఒక బంధం విడిపోవాలంటే చిన్న కారణం చాలు. కుండెడు పాలను విరగొట్టాలంటే ఒక చుక్క విషం చాలు. ఇలాంటి విషపు చుక్కలాంటి కారణం వల్లే టాలీవుడ్ లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన మెహరీన్.. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్య భిష్ణోయ్ తో చెట్టాపట్టలేసుకొని తిరిగింది. అంతేకాదు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.. ఈ క్రమంలో 2021 మార్చిలో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు.

విడిపోయారు

ఎంగేజ్మెంట్ అయిన కొద్ది రోజులకే మెహరీన్, భవ్య విడిపోయారు.. అభిప్రాయ భేదాలు తలెత్తడంతో పెళ్లి రద్దు చేసుకుంటున్నామని ప్రకటించారు. ఆ తర్వాత వారి వారి వ్యక్తిగత జీవితాల్లో బిజీగా మారిపోయారు. మెహరీన్ హీరో యిన్ గా కంటిన్యూ చేస్తుంటే.. భవ్య 2022 లో జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి తరఫున పోటీ చేసి ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మెహరీన్ తో విడిపోయిన తర్వాత భవ్య ఐఏఎస్ ఆఫీసర్ ను పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ పరి భిష్ణోయ్ తో కలిసి త్వరలో ఏడు అడుగులు వేయనున్నారు. ఈ క్రమంలో ఇటీవల హర్యానాలో ఘనంగా వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఎక్కడ వేసిన గొంగడి అక్కడే

భవ్యతో విడిపోయిన తర్వాత మెహరీన్ కెరియర్ ఏం అంత బాగోలేదు. ఎఫ్ 3 సినిమా విజయవంతమైనప్పటికీ ఆమెకు ఆశించినంత స్థాయిలో అవకాశాలు దక్కడం లేదు. మారుతి దర్శకత్వంలో వచ్చిన “మంచి రోజులు వచ్చాయి” సినిమా తర్వాత ఆమె మరే సినిమాకి సైన్ చేయలేదు. గ్లామరస్ ఫోటో షూట్ లతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నప్పటికీ మెహరిన్ ను పట్టించుకునే వారే లేరు. నా జుగ్గా తయారయి అందంగా కనిపిస్తున్నప్పటికీ మెహరిన్ కు అవకాశాలు లేకుండా పోతున్నాయి. పాపం మెహరిన్!