
Megastar Chiranjeevi: ప్రస్తుతం మన తెలుగు సినిమా ఇండస్ట్రీ మార్కెట్ పాన్ వరల్డ్ రేంజ్ కి ఎగబాకింది.ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత హాలీవుడ్ దర్శక నిర్మాతలు సైతం తెలుగు సినిమా వైపు చూడడం ప్రారంభించారు.ఇలాంటి సమయం లో మన స్థాయిని మరింత పెంచే సినిమాలే చెయ్యాలి కానీ, తగ్గించే సినిమాల జోలికి అసలు పోకూడదు.మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత జరిగింది ఇదే.రీ ఎంట్రీ తర్వాత ఆయన ఆరు సినిమాలు చేస్తే అందులో మూడు రీమేక్ సినిమాలే అవ్వడం విశేషం.
గత ఏడాది విడుదలైన ‘గాడ్ ఫాదర్’ సినిమా మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచినా ‘లూసిఫెర్’ అనే చిత్రానికి రీమేక్.ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో తెలుగు వెర్షన్ లో కూడా అందుబాటులో ఉంది.అలాంటి సినిమాని రీమేక్ చేస్తే మన మార్కెట్ దెబ్బతింటుంది అని తెలిసి కూడా చిరంజీవి చేసాడంటే ఆయనకీ స్క్రిప్ట్ సెలక్షన్ మీద పట్టు పోయిందా అనే సందేహం అభిమానుల్లో కలిగింది.
గాడ్ ఫాదర్ కి టాక్ వచ్చినా కూడా వసూళ్లు రాలేదు, కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది.ఆ సినిమా తర్వాత ఆయన చేసిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం పెద్ద హిట్ అయ్యింది.ఇది రీమేక్ సినిమా కాదు, డైరెక్ట్ సినిమా.ఈ చిత్రం తర్వాత మెహర్ రమేష్ తో ‘భోళా శంకర్’ అనే సినిమా చేస్తున్నాడు, ఇది తమిళం లో సూపర్ హిట్ గా నిలిచినా ‘వేదలమ్’ చిత్రానికి రీమేక్.ఇదే ఆయన కెరీర్ ఆఖరి రీమేక్ అని కూడా తెలుస్తుంది.

ఇక నుండి రీమేక్ సినిమాలు కాకుండా న్యూ ఏజ్ డైరెక్టర్స్ తో వయస్సు కి తగ్గ పాత్రలు చెయ్యాలని అనుకుంటున్నాడట మెగాస్టార్.రీసెంట్ గానే భింబిసారా డైరెక్టర్ వసిష్ఠ మెగాస్టార్ ని కలిసి ఒక సోషియో ఫాంటసీ కథని వినిపించాడట.వెంటనే ఓకే చెప్పేసాడు మెగాస్టార్,ఈ చిత్రం తర్వాత కళ్యాణ్ కృష్ణ తో కూడా ఒక సినిమా చెయ్యబోతున్నాడు.ఇలా వరుసగా కుర్ర డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇస్తూ రీమేక్స్ ని పూర్తిగా దూరం పెట్టినందుకు ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు.