Chiranjeevi Pawan Kalyan : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా మరో రెండు రోజుల్లో మన ముందుకి రాబోతోంది.. మెగా అభిమానులు , ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలకు , ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ప్రాంతాలలో ప్రారంభం అవ్వగా టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి.

తెలంగాణలో ఈ సినిమాకి టికెట్ హైక్స్ ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ చిత్రానికి పాతిక రూపాయిల వరకు టికెట్ రేట్స్ పెంచుకోవచ్చని ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.. ఇక టాక్ రావడం ఒక్కటే తరువాయి..టాక్ వస్తే మెగాస్టార్ మాస్ విశ్వరూపానికి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ మొత్తం గల్లంతు అవ్వడం ఖాయం..ఇక ఈ సినిమా ప్రొమోషన్స్ విషయంలో కూడా మెగాస్టార్ ఎక్కడా తగ్గడం లేదు.. ఎప్పుడూ ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి పెద్దగా ఆసక్తి చూపించని మెగాస్టార్ ఈసారి మాత్రం ఇంటర్వ్యూస్ వరుసగా ఇచ్చేస్తున్నాడు.
రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి షాకింగ్ కామెంట్స్ చేసాడు.. ఆయన మాట్లాడుతూ ‘ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలను నేను పరిశీలించడం పూర్తిగా మానేసాను.. మీరందరూ రాజకీయాలను పరిశీలించే దాంట్లో నేను పావు శాతం కూడా రాజకీయాలను పట్టించుకోవడం లేదు.. నా దృష్టి మొత్తం సినిమాలపైనే.. నా కుటుంబం నుంచి ఒకరు రాజకీయాల్లోకి వెళ్లడం నాకు ఇష్టం లేదు.. కానీ వెళ్తాను అంటే అది తన ఇష్టం.. ఎవరి స్వతంత్రం వారిది.. నా కుటుంబంలో వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారు కదా అని నేను ఉండాల్సిన అవసరం లేదు.. కాబట్టి నన్ను రాజకీయాలకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడగొద్దు’ అంటూ చిరంజీవి మీడియా రిపోర్టర్ కి చాలా ఘాటుగా సమాధానం చెప్పాడు.. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు సెన్సేషనల్ టాపిక్ గా మారింది.. ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ ని బ్రేకింగ్ న్యూస్ గా వేస్తున్నారు.
నాకు ఆంధ్రా రాజకీయాలతో సంబంధం లేదు
– చిరంజీవి pic.twitter.com/KxeB4IrVG0
— Rahul (@2024YCP) January 11, 2023