Unstoppable 2 : ఆహా మీడియాలో ప్రసారం అవుతున్న నందమూరి బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ సీజన్ 2 కి ఎలాంటి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందో మన అందరం చూస్తూనే ఉన్నాం.. సీజన్ 1 కంటే సీజన్ 2 కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.. ఈ సీజన్ లో ప్రభాస్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలు హాజరయ్యారు..ప్రభాస్ ఎపిసోడ్ ఈ మధ్యనే రెండు భాగాలుగా స్ట్రీమింగ్ అవ్వగా, అతి త్వరలోనే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్ కాబోతుంది.

అయితే ఈ లోపే సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న బాలయ్య బాబు ‘వీర సింహా రెడ్డి’ మూవీ కి సంబంధించిన టీంతో ఒక ఎపిసోడ్ ని షూట్ చేసారు..ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతుంది..ఈ ఎపిసోడ్ లో డైరెక్టర్ గోపీచంద్ మలినేని , వరలక్ష్మి శరత్ కుమార్ మరియు హనీ రోజ్ తో పాటుగా విలన్ గా నటించిన దునియా విజయ్ కూడా పాల్గొన్నాడు.
ఈ ప్రోమోలో బాలయ్య బాబు వీళ్ళతో సరదాగా చేసిన చిట్ చాట్ అభిమానులను అలరించింది..అంతే కాకుండా బాలయ్య ఫోన్ లో మాస్ మహారాజా రవితేజ తో మాట్లాడిన సంభాషణ కూడా హైలైట్ గా నిలిచింది.. ఆయన మాట్లాడుతూ ‘వంద కోట్ల హీరోకి కంగ్రాట్స్’ అని రవితేజ తో అంటాడు.. అప్పుడు రవితేజ బాలయ్య తో ‘థాంక్యూ తమ్ముడూ’ అని అంటాడు చూసేందుకు అది చాలా ఫన్నీ గా అనిపించింది.
ఇక ఆ గోపీచంద్ మలినేనిని బాలయ్య బాబు ఒక ప్రశ్న అడుగుతూ ‘క్రాక్ సినిమాకి ముందు రెండేళ్ల పాటు కెరీర్ పరంగా బాగా ఇబ్బంది పడ్డావ్..ఆ సమయం లో నీ ప్రాపర్టీ ని కూడా అమ్మేశావ్.. అలాంటి కష్ట సమయంలో నీ మానసిక పరిస్థితి ఎలా ఉన్నింది’ అంటాడు బాలయ్య.. అప్పుడు గోపీచంద్ చాలా ఎమోషనల్ లో సమాధానం చెప్తాడు..ఏమి చెప్పాడు అనేది తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే..సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అవుతున్న ఆ ప్రోమో ని మీరు కూడా చూసేయండి.
https://www.youtube.com/watch?v=bCQ5zMb2Txo