Chandrababu – Jr NTR : రాబోయే రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎవ్వరూ ఊహించని రీతిలో మలుపులు తీసుకోబోతున్నాయా.. రాజకీయ చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు వేసిన ఎత్తుగడలో వైసీపీ పార్టీ చిత్తు చిత్తు అవ్వబోతుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..వైసీపీ పార్టీ ని గద్దె దించే విధంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా చంద్రబాబు పెద్ద మాస్టర్ ప్లాన్ వేసాడు..ఆంధ్ర ప్రదేశ్ లో రెండో ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న జనసేన పార్టీ తో త్వరలోనే ఆయన కలవబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

దీని గురుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ, టీడీపీ – జనసేన పార్టీలు కలిస్తే ఓడిపోవడం ఖాయమనే విషయం మాత్రం వైసీపీ శ్రేణులకు అర్థం అయ్యిపోయింది..వాళ్ళ ప్రతీ మాటలో ఆ ఆవేదన అయితే కనిపిస్తుంది..అయితే టీడీపీ – జనసేన పార్టీ లకు మరో బలం చేకూరింది..ఈ రెండు పార్టీల కూటమికి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారకర్త గా ఉండబోతున్నాడని తెలుస్తుంది.
జూనియర్ ఎన్టీఆర్ తో నారా చంద్రబాబు నాయుడు ఇటీవలే భేటీ అయ్యాడని.. ఈ సందర్భంగా ఆయన ఈ విషయం గురించే ప్రస్తావించాడని.. ఈసారి ఎన్నికలలో నీ సేవలు కూడా ఎంతో కీలకం..రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది..పవన్ కళ్యాణ్ మనతో చేతులు కలపబోతున్నాడు..నువ్వు కూడా ఆయనకీ తోడు అయితే ఈసారి ఎన్నికలలో మన విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు’..అని ఎన్టీఆర్ ని చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ చేసాడట.
ఎన్టీఆర్ కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం..2009 ఎన్నికలలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరుపున ఏ రేంజ్ లో ప్రచారం చేసాడో మన అందరికి తెలిసిందే..ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం సినిమాల మీద మాత్రమే ద్రుష్టి కేంద్రీకరించాడు..మళ్ళీ ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత తెలుగు దేశం – జనసేన కూటమి కోసం నడుం బిగించనున్నాడు అంటూ సోషల్ మీడియా లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది.