Allu Arjun Arrested: కాసేపటి క్రితమే హైదరాబాద్ పోలీసులు జూబ్లీ హిల్స్ లోని అల్లు అర్జున్ నివాసానికి చేరుకొని, అతన్ని అరెస్ట్ చేసి చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనం గా మారింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ లోని అందరి హీరోల అభిమానులు దీనిపై చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఏ తప్పు చేయని అల్లు అర్జున్ పై నాన్ బెయిల్ కేసు వేసి అరెస్ట్ చేయడం అన్యాయం అని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీ మీద పగబట్టారని కామెంట్స్ చేస్తున్నారు. అక్కినేని కుటుంబాన్ని ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి మహిళ అత్యంత నీచంగా మాట్లాడినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకొని రేవంత్ రెడ్డి, ఈ ఘటనపై ఏకంగా సూపర్ స్టార్ ఇంట్లోకి చొరబడి అరెస్ట్ చేయడం విచారకరమని సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమానులు మండిపడుతున్నారు. మరోపక్క ఈ ఘటనపై అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ తీవ్రమైన ఆందోళనతో ఉన్న వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.
ఇదంతా పక్కన పెడితే ఈ ఘటన తెలుసుకున్న వెంటనే అల్లు అర్జున్ మేనమామ మెగాస్టార్ చిరంజీవి షాక్ కి గురయ్యాడు. విశ్వంభర షూటింగ్ లో బిజీ గా ఉన్నప్పుడు ఆయనకి ఈ విషయం తెలిసిందే. వెంటనే ఇవాళ్టి షూటింగ్ ని రద్దు చేసుకొని చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ కి పయనం అయ్యాడు. ఈ విషయం కాసేపటి క్రితమే మీడియా కి తెలిపింది చిరంజీవి పీఆర్ టీం. గత కొంత కాలం గా మెగా, అల్లు కుటుంబాల మధ్య చాలా గ్యాప్ ఏర్పడిందని మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. అవన్నీ కేవలం పుకార్లే అని, కష్టం వచ్చినప్పుడు మెగా ఫ్యామిలీ లో ఒకరి కోసం ఒకరు ఎలా నిలబడుతారో ఇలాంటి సందర్భాలు చూసినప్పుడే అభిమానులకు అర్థం అవుతుందని సోషల్ మీడియా లో అభిమానులు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు.
అయితే పోలీస్ స్టేషన్ కి చిరంజీవి రావడం వల్ల, అశాంతి వాతావరణం నెలకొనే అవకాశాలు ఉన్నాయని, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, ఆయన ఇక్కడికి వచ్చేందుకు వీలు లేదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారట. మరోపక్క సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖులందరూ ఒక్కొక్కరిగా పోలీస్ స్టేషన్ కి చేరుకుంటున్నారు. కాసేపటి క్రితమే నిర్మాత దిల్ రాజు వచ్చాడు. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి కానీ, ఆయన రావడం వల్ల ఇంకా ఎక్కువ అశాంతి వాతావరణం నెలకొనే అవకాశాలు ఉండడంతో ఆయన కూడా పోలీస్ స్టేషన్ కి రాకపోవచ్చని అంటున్నారు. మరోపక్క అల్లు అర్జున్ మీద పడిన కేసులు మామూలివి కావు. ఇవి కోర్టు లో నిరూపితం అయితే ఆయనకి పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.
Breaking – Megastar Chiranjeevi & his wife, Surekha Garu reached Allu Arjun’s residence. pic.twitter.com/9UTkbRrpiY
— Aakashavaani (@TheAakashavaani) December 13, 2024