Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం ఎలా మొదలైంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు..ఆయన హీరో గా నిలదొక్కునేందుకే చాలా సమయం పట్టింది..చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ విలన్ రోల్స్ ని కూడా వదలకుండా చేస్తూ ఆ తర్వాత హీరో గా మారి హిట్టు మీద హిట్టు కొట్టి ఈరోజు మెగాస్టార్ అయ్యాడు..నెంబర్ 1 హీరో గా నాలుగు దశాబ్దాల నుండి కొనసాగుతూనే ఉన్నాడు..అయితే చిరంజీవి సినిమాల్లోకి రాకపొయ్యుంటే ఏమయ్యేవాడు..వాళ్ళ నాన్నగారి లెక్కనే పోలీస్ డిపార్ట్మెంట్ కి వెళ్ళేవారా..?

లేకపోతే వేరే వృత్తి లో కొనసాగేవాడా..? ఇలాంటి సందేహాలు ప్రతి ఒక్కరికి రాక తప్పదు..అయితే లేటెస్ట్ గా చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో తన జీవితం లో చోటు చేసుకున్న అతి ముఖ్యమైన సంఘటన ని అభిమానులకు పంచుకున్నాడు..అది తెలుసుకున్న అభిమానులు షాక్ కి గురైయ్యారు..ఇక అసలు విషయానికి చిరంజీవి కి కొద్ది రోజుల క్రితమే గోవా లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ‘ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022’ అవార్డుని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భం గా గోవా విమానాశ్రయం లో NCC గ్రూప్ అనగా నావెల్ క్యాడెట్ కార్ప్స్ కి చెందిన వారు గుంపుగా చిరంజీవి వద్దకి వచ్చి ఫోటో తీసుకున్నారు..ఈ ఫోటో ని షేర్ ని చేస్తూ చిరంజీవి తన పాత రోజులను గుర్తు చేసుకున్నాడు..చిరంజీవి సినిమాల్లోకి రాకముందు ఆయనకీ NCC లో పని చేసే అరుదైన అవకాశం దక్కింది..చేతిలో ఆఫర్ లెటర్ కూడా ఉంది..కానీ ఆయనకీ సినిమాల మీద ఉన్న ప్రేమ వల్ల అలాంటి అవకాశం ని వదిలేసుకున్నాడు..ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తికీ ఇలాంటి ఉద్యోగ అవకాశం రావడం అనేది ఒక వరం.

కానీ చాలా తేలికగా వదులుకున్నాడు మన మెగాస్టార్..అద్భుతమైన జీవితం ఒక పక్క ఆహ్వానం పలుకుతున్నా కూడా చిరంజీవి ముళ్లబాటా ప్రయాణప్రాయమైన సినీ ఇండస్ట్రీ ని ఎంచుకున్నాడు..ఒకవేళ సినిమా ఇండస్ట్రీ లో సక్సెస్ కాకపొయ్యుంటే అనే ఆలోచన ఆయన మనసులోకి రాలేదు..ఇండస్ట్రీ ని ఏలేయాలి అనే కసితోనే ఆయన కష్టపడ్డాడు..ఈరోజు కోట్లాది మంది ప్రజలకు ఆదర్శప్రాయం అయ్యాడు.