Waltair Veerayya Hindi Collection: మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మనం చూస్తూనే ఉన్నాము..’ఖైదీ నెంబర్ 150′ చిత్రం తర్వాత మెగాస్టార్ చేసిన పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా అవ్వడం తో జనాలు థియేటర్స్ కి బారులు తీశారు..పైగా వింటేజ్ మెగాస్టార్ కామెడీ టైమింగ్ ఈ సినిమాలో బాగా పేలింది అనే టాక్ పబ్లిక్ లో బాగా స్ప్రెడ్ అయ్యింది..ఇక అంతే వయస్సు తో సంబంధమే లేకుండా ప్రతీ ఒక్కరు థియేటర్స్ బయట టికెట్స్ కోసం పడిగాపులు కాస్తున్నారు.

కేవలం ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రమే కాదు..ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా దుమ్ము లేపేస్తుంది..జనవరి 13 వ తారీఖున ఈ సినిమా తెలుగు తో పాటుగా హిందీ లో కూడా విడుదలైంది..’సై రా నరసింహా రెడ్డి’ చిత్రం నుండి చిరంజీవి వరుసగా తెలుగు తో పాటు హిందీ లో కూడా విడుదల చేస్తూ వస్తున్నాడు..ఒక్క ‘ఆచార్య’ సినిమా మాత్రమే హిందీ లో విడుదల కాలేకపోయింది.
హిందీ లో ఇప్పటివరకు ‘వాల్తేరు వీరయ్య’ ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి గమనిస్తే, మొదటి రోజు ఈ చిత్రానికి అక్కడ నాలుగు కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది..బాలీవుడ్ లో ప్రస్తుతం సినిమాలేవీ కూడా లేకపోవడం ‘వాల్తేరు వీరయ్య’ కి బాగా కలిసొచ్చిన అంశం..ఇక రెండవ రోజు కూడా ఈ చిత్రం అదే రేంజ్ వసూళ్లను రాబట్టింది..కానీ మూడవ రోజు మాత్రం మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టి అందరినీ షాక్ కి గురి చేసింది.

మూడవ రోజు ఈ చిత్రానికి అక్కడ 5 కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు సమాచారం..అలా మూడు రోజులకు కలిపి ఈ సినిమా హిందీ వెర్షన్ 10 కోట్ల రూపాయిల నెట్ మరియు 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి..ఇదే ట్రెండ్ కొనసాగితే ఫుల్ రన్ లో ఇక్కడ 30 కోట్ల రూపాయిల వరకు నెట్ వసూళ్లను రాబడుతుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.