Homeజాతీయ వార్తలుPM Modi : రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ ఎటు వైపు ఉందో స్పష్టం చేసిన ప్రధాని

PM Modi : రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ ఎటు వైపు ఉందో స్పష్టం చేసిన ప్రధాని

PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వైట్ హౌస్ లో సమావేశమయ్యారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత తన పదవీకాలంలో జరిగిన తొలి అధికారిక సమావేశం ఇది. ఉక్రెయిన్‌(Ukrine)లో వాణిజ్యం, వలసలు, కొనసాగుతున్న యుద్ధం గురించి కూడా ఇద్దరు అగ్ర నాయకులు చర్చించారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ తటస్థంగా ఉందని ప్రపంచం అనుకుంటోందని ప్రధాని మోదీ అన్నారు. కానీ భారత్ ఎప్పుడూ శాంతివైపే ఉంటుందని చెప్పారు. పుతిన్‌(Putin)తో ట్రంప్ చర్చలు జరపడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో భారతదేశం పాత్ర గురించి ప్రధాని మోదీని ఒక ప్రశ్న అడిగారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడూ రష్యా, ఉక్రెయిన్‌లతో సన్నిహితంగానే ఉన్నాను. నేను రెండు దేశాల నాయకులను కలిశాను. భారతదేశం తటస్థంగా ఉందని చాలా మందికి ఒక అపోహ ఉంది. కానీ నేను మళ్ళీ చెబుతున్నాను. భారతదేశం తటస్థంగా ఏం లేదు. మనకు ఒక స్టాండ్ ఉంది. మా స్టాండ్ శాంతి.’’ అని ప్రధాని మోడీ తెలిపారు.

‘ఇది యుద్ధానికి సమయం కాదని రష్యా అధ్యక్షుడు పుతిన్ సమక్షంలో నేను మీడియాకు చెప్పాను’ అని ప్రధాని మోదీ(Pm Modi) అన్నారు. సమస్యలకు పరిష్కారాలు యుద్ధభూమిలో దొరకవు, వాటిని టేబుల్ వద్ద చర్చించడం ద్వారా మాత్రమే పరిష్కారం అవుతాయి. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ అధ్యక్షుడు ట్రంప్.. “చైనాతో మనకు చాలా మంచి సంబంధాలు ఉంటాయని నేను భావిస్తున్నాను. COVID-19 మహమ్మారి వచ్చే వరకు నాకు అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చాలా మంచి సంబంధం ఉంది. ప్రపంచంలో చైనా చాలా ముఖ్యమైన దేశం అని నేను అనుకుంటున్నాను. ఉక్రెయిన్, రష్యాతో ఈ యుద్ధాన్ని ముగించడంలో వారు మనకు సహాయం చేస్తారని నేను భావిస్తున్నాను. చైనా, భారతదేశం, రష్యా, అమెరికా కలిసి పనిచేయగలవని నేను ఆశిస్తున్నాను. ” అని అన్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చలు జరపనున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతలో ఉత్తర అట్లాంటిక్ ఒప్పంద సంస్థ (NATO)లోని అనేక సభ్య దేశాలు ఉక్రెయిన్, యూరప్‌లను శాంతి చర్చలకు దూరంగా ఉంచాలాని పేర్కొన్నాయి. నాటో సభ్య దేశమైన బ్రిటన్ రక్షణ మంత్రి జాన్ హీలీ మాట్లాడుతూ.. “రష్యా.. ఉక్రెయిన్‌తో పాటు ఇతర దేశాలకు ముప్పుగా కొనసాగుతుందని మర్చిపోవద్దు” అని అన్నారు. ఉక్రెయిన్ ఎప్పటికీ నాటో కూటమిలో చేరకూడదని చెప్పడంతో అమెరికా నాటోను ఇబ్బందుల్లోకి నెట్టింది. భవిష్యత్తులో ఉక్రెయిన్ భద్రతకు యూరోపియన్ మిత్రదేశాలు బాధ్యత వహించాలి. కీవ్ లేకుండా ఉక్రెయిన్ గురించి ఎటువంటి సంభాషణ ఉండదని హీలీ అన్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular