Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చర్యలు ఎప్పుడూ ఊహాతీతం గానే ఉంటాయి..ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది ఆయనతో తరుచు టచ్ లో ఉండే సన్నిహితులు కూడా అంచనా వెయ్యలేరు..సినిమాల మీద పెద్ద ఆసక్తి లేదు అన్నట్టు కనిపించే పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ని ప్రకటించాడు..ప్రస్తుతం హరిహర వీరమల్లు వంటి భారీ బడ్జెట్ పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమా తర్వాత చెయ్యబొయ్యే సినిమాల గురించి కూడా తన నిర్మాతలతో ప్రకటన చేయించేసాడు.

ఇటీవలే ఆయన ప్రముఖ డైరెక్టర్ సుజీత్ తో ఒక సినిమా చెయ్యబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే..#RRR తరవాత నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం ఇది..ఈ సినిమా తో పాటుగా హరీష్ శంకర్ తో మరో సినిమా చెయ్యబోతున్నాడు..ఈ వారం లోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలు మొదలు కాబోతున్నాయి..ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉన్నారు.
హరీష్ శంకర్ మరియు సుజీత్ సినిమాలను సమాంతరంగా ప్రారంభించి పూర్తి చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నాడు పవన్ కళ్యాణ్..హరి హర వీరమల్లు తర్వాత ఇక అసలు పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడా అని అనుకుంటున్నా ఫ్యాన్స్ కి వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ని ప్రకటిస్తూ షాక్ కి గురి చేసాడు..పవన్ కళ్యాణ్ ఇలా వరుసగా సినిమాలు ఒప్పుకోవడానికి కూడా కారణం ఉంది..అదేమిటి అంటే ఇలా వరుసగా డేట్స్ ఇవ్వడం వల్ల పవన్ కళ్యాణ్ కి భారీ స్థాయి అడ్వాంసులు ఇచ్చారు నిర్మాతలు..ప్రస్తుతం ఆయనకీ ఇది చాలా అవసరం..ఎందుకంటే ఎన్నికలు సమీపించేస్తున్నాయి..రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ త్వరలోనే బస్సు యాత్ర చెయ్యబోతున్నాడు.

ఇందుకు సంబంధించి ‘వారాహి’ అనే పేరు తో ప్రత్యేకంగా ఒక బస్సు ని కూడా తయారు చెయ్యించేసుకున్నాడు..సభలు,రోడ్ షోలు నిర్వహించడానికి కోట్లలో డబ్బులు అవసరం ఉంటుంది..అందుకే పవన్ కళ్యాణ్ ఇలా వరుసగా సినిమాలు ఒప్పుకొని అడ్వాన్స్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది..మరి ఒక పక్క రాజకీయ యాత్ర మరో పక్క సినిమాలను పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ఎలా బ్యాలన్స్ చేస్తాడో చూడాలి.