Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu cry on set: ఆ మూవీ షూటింగ్ లో మహేష్ బాబు ను...

Mahesh Babu cry on set: ఆ మూవీ షూటింగ్ లో మహేష్ బాబు ను ఏడిపించిన స్టార్ డైరెక్టర్…

Mahesh Babu cry on set: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణం ఏంటి అంటే వాళ్ళు చేసే సినిమాలు ప్రేక్షకులకు ఎక్కువగా నచ్చుతాయి. అలాగే వాళ్ళ సినిమాలకు కలెక్షన్స్ కూడా భారీ రేంజ్ లో వస్తాయి. కాబట్టి ప్రొడ్యూసర్లు సైతం వాళ్లతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇలాంటి క్రమంలోనే సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన మహేష్ బాబు సైతం స్టార్ హీరోగా […]

Mahesh Babu cry on set: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణం ఏంటి అంటే వాళ్ళు చేసే సినిమాలు ప్రేక్షకులకు ఎక్కువగా నచ్చుతాయి. అలాగే వాళ్ళ సినిమాలకు కలెక్షన్స్ కూడా భారీ రేంజ్ లో వస్తాయి. కాబట్టి ప్రొడ్యూసర్లు సైతం వాళ్లతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇలాంటి క్రమంలోనే సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన మహేష్ బాబు సైతం స్టార్ హీరోగా అవతరించాడు… ప్రస్తుతం ఆయన ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో భారీ రికార్డులను కొల్లగొట్టాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. పాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులందరిని ఆకట్టుకునే విధంగా ఉండటమే కాకుండా ప్రపంచ స్థాయి ప్రేక్షకులను సైతం తన వైపు తిప్పుకునే విధంగా రాజమౌళి ప్రణాళికలు రూపొందిస్తున్నాడు… ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు ఒక సినిమా షూటింగ్లో పాల్గొన్నప్పుడు ఒక దర్శకుడు అతన్ని టార్చర్ పెట్టాడట. అందువల్ల అతను కన్నీరు కూడా పెట్టుకున్నాను అంటూ గతంలో కొన్ని సందర్భాల్లో తెలియజేశాడు.

అసలు మేటర్ లోకి వెళ్తే ఖలేజా సినిమా షూట్ చేస్తున్న సమయంలో చైతన్య అనే ఆర్టిస్టు మహేష్ బాబు చేయి పట్టుకొని కన్నీళ్లు పెడుతూ కొన్ని డైలాగ్స్ చెబుతాడు. అలా అతను చెబుతున్నప్పుడు తన కళ్ళల్లో నుంచి వాటర్ అయితే వస్తుంది. అవి చూసిన మహేష్ బాబుకి ఆటోమేటిగ్గా కండ్లల్లో నుంచి వాటర్ వచ్చాయట.

ఇక ఈ విషయాన్ని త్రివిక్రమ్ తో చెప్పాడట. ఆ టేక్ రెండు మూడు సార్లు చేసిన కూడా ఓకే కాకపోవడంతో మహేష్ బాబు నేను అతను ఉంటే సరిగ్గా చేయలేకపోతున్నా నాకు కన్నీళ్లు వస్తున్నాయి.అతను లేకుండా సోలోగా నేను క్లోజ్ షాట్ ఒకటి చేస్తాను అని చెప్పారట. అయినప్పటికి త్రివిక్రమ్ మాత్రం మీరు సింగిల్ గా చేస్తే ఆ ఎమోషన్ పర్ఫెక్ట్ గా రాదని పట్టుబట్టి మరి చైతన్య కాంబినేషన్లో మహేష్ బాబు తో యాక్టింగ్ చేయించారట.

దెబ్బకు మహేష్ బాబుకు షాట్ అయిపోయిన వెంటనే కళ్ళల్లో నుంచి వాటర్ వచ్చిందట. అలా మహేష్ ఆ సినిమా షూటింగ్ సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా పలు సందర్భాల్లో తెలియజేశాడు. మొత్తానికైతే త్రివిక్రమ్ ఆ రకంగా మహేష్ బాబు ను కొంతవరకు ఇబ్బంది పెట్టారట…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper