Valentines Day : లవర్స్ డే, ప్రేమికుల రోజు, వాలెంటెన్స్ డే అబ్బో.. ఈ రోజుకు పేర్లు ఎన్ని ఉన్నా సరే ప్రేమికులు మాత్రం ఫుల్ గా గుర్తు పెట్టుకుంటారు కదా. అది చాలా స్పెషల్ డే అండీ బాబూ. గుర్తు పెట్టుకోకపోతే ఎలాగా? మదర్స్ డే రోజు, ఫాదర్స్ డే రోజు, సిస్టర్స్ డే రోజు మీరు మీ అమ్మానాన్నఅక్కచెల్లి అంటూ వారిని సర్ప్పైజ్ చేయకపోయినా పర్వాలేదు. కానీ, లవర్స్ డే రోజు మీ ప్రియమైన వారిని కాస్త ప్రేమగా ఆశ్చర్యపర్చాల్సిందే. లేదంటే వారికి కోపం వచ్చేస్తుంటుంది కదా. కోపం గురించి పక్కన పెడితే కాస్త మీ విషెష్ కోసం వేచి చూస్తారు. ఓ చిన్న గిఫ్ట్ ఇచ్చినా సరే తెగ సంతోష పడతారు. అయితే మీ లవర్ ను ఎలా సంతోష పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
నో గిఫ్ట్: ఇదేంటి ముందే నో గిఫ్ట్ అనేశారు అని షాక్ అవ్వద్దు. గిఫ్ట్ లు ఇవ్వకుండా కూడా సంతోష పడే వారు చాలా మందే ఉన్నారు. మీ మాటలు, వారి మీద మీరు చూపే కేర్, మీరు పడే తాపత్రయం వారికి అర్థం అయినా సరే వారికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో గిఫ్ట్ మాత్రమే ఇవ్వాలి అనుకోకుండా వారు ఏ విషయంలో సంతోషపడతారో కాస్త ఆలోచించి సంతోష పెట్టండి. మీరు ప్రేమగా రాసే కవిత కూడా వారిని సంతోష పడుతుంది. మాకు కవితలు రావు కదా అనుకుంటే జై గూగుల్ తల్లి. లేదంటే ఫ్రెండ్స్ హెల్ప్. ఓ మంచి కవిత, లేదా మీకు వారి మీద ఎంత ప్రేమ ఉందో తెలియజేయండి. ఇట్టే ఐస్ అయిపోతారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
చిన్న చిన్న గిఫ్టులు: ప్రేమికులకు లక్షలు పెట్టి బంగారం కొనివ్వాల్సిన అవసరం మాత్రమే లేదు. ఒక చిన్న కీ చైన్ ప్రతి సారి నా గుర్తుగా ఇది నీతోనే ఉంటుంది కదా అని కాస్త ప్రేమగా చెప్పి ఓ చిన్న కీ చైన్ ను గిఫ్ట్ చేసినా సరే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మీతో గిఫ్టులు, మనీ కోసం మాత్రమే లవ్ చేసే వారి గురించి మాత్రం కాదండోయ్ ఈ స్టోరీ. మీది ప్యూర్ లవ్ అయితే ఎలాంటి టెన్షన్ లేకుండా మీ లవ్ ను ముందుకు తీసుకెళ్లడానికి చిన్న టిప్స్ పాటించినా సరి పోతుంది.
కలవడం: ఈ రోజు స్పెషల్ డే కాబట్టి వారిని కలిసి కాస్త విష్ చేయండి. తనకు నచ్చే మంచి డ్రెస్ వేసుకొని తన ముందు వాలిపోండి. కావాలంటే నీకు ఏ కలర్ అంటే ఇష్టం అని అడిగి మరీ వేసుకొని వెళ్లండి. మరీ పార్కులు, పబ్బులు వెళ్లకుండా కాస్త తన చేయి పట్టుకొని ప్రేమగా మాట్లాడిన చాలు ఈ డే విజయవంతం అవుతుంది. తన కోసం అంత దూరం వెళ్లారు కదా. సో హ్యాపీ అవుతుంది. ఇక మీ పక్కనే ఉంటే కూడా పర్వాలేదు. హ్యాపీగానే ఫీల్ అవుతారు. ఈ రోజును వారి కోసం కేటాయించండి చాలు.
ఫుడ్: వారికి ఏదో ఒక ఫేవరేట్ ఫుడ్ ఉంటుంది. కుదిరితే వారికి ఇష్టమైన ఫుడ్ ను ప్రిపేర్ చేసుకొని వెళ్లండి. ఎంత సంతోషపడతారో తెలుసా? అవును మేము అబ్బాయిలం కదా. ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తాము? అది కూడా వారికి ఇష్టమైన ఫుడ్ అంటే కష్టం కదా అనుకోవద్దు. ఇంట్లో అమ్మ లేదా అక్క లేదా చెల్లి హెల్ప్ తీసుకోండి. మీరు స్వయంగా ప్రిపరే చేసినా లేదా చేయించినా సరే అందులోని మీ ప్రయత్నాన్ని, ప్రేమను అర్థం చేసుకొని ఓ పెద్ద ఖరీదైన గిఫ్ట్ ఇచ్చినా రాని సంతోషం ఆమెకు వస్తుంది. సో ఓ సారి ట్రై చేయండి.