
Mahesh-Rajamouli Movie: ప్రేక్షకుడు అంచనాలకు మించి ఇవ్వడం రాజమౌళి స్టైల్. ఆయన సక్సెస్ సీక్రెట్ కూడా అదే. ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడు. హీరో ఎవరైనా తన కథలో, సన్నివేశాల్లో ఒదిగిపోయేలా చేస్తాడు. సినిమాను యజ్ఞంలా భావించే రాజమౌళి ప్రతి సన్నివేశాన్ని జాగ్రత్తగా తీర్చిదిద్దుతాడు. లేటైనా పర్లేదు గొప్ప అవుట్ ఫుట్ తో రావాలి అనుకుంటారు. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ విషయంలో ఆయన ఎక్కడలేని ఒత్తిడికి గురయ్యారు. కరోనా కారణంగా అనుకోని సమస్యలు ఏర్పడ్డాయి. అనుకున్న సమయానికి షూట్ పూర్తి కాలేదు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ నుండి ప్రెజర్ అనుభవించారు.
అయినా రాజమౌళి తన పాలసీ వదల్లేదు. పరిస్థితులు చక్కబడే వరకు ఎదురుచూశారు. అందుబాటులో ఉన్న బడ్జెట్, సమయంతో బెటర్ మూవీ ఇచ్చారు. ఆ కష్టం సిల్వర్ స్క్రీన్ మీద మిరాకిల్స్ చేసింది. అంతర్జాతీయ గుర్తింపు పొందేలా చేసింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ గోల్డెన్ గ్లోబ్ గెలుచుకుంది. ఆస్కార్ బరిలో నిలిచింది. ఆర్ ఆర్ ఆర్ రాజమౌళి ఫేమ్ ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. మరింత గొప్ప చిత్రాలు తెరకెక్కించే బాధ్యత పెరిగేలా చేసింది.
ఈ క్రమంలో తన అప్ కమింగ్ మూవీని అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి నెక్స్ట్ హీరో మహేష్ తో చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే ఏడాది మహేష్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ క్రమంలో ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన ఒక ఆసక్తికర సమాచారం టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. రాజమౌళి ఏకంగా రూ. 15 కోట్లు ప్రీ ప్రొడక్షన్ పనులకు కేటాయించారట. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించాలని డిసైడ్ అయిన రాజమౌళి ఖర్చు విషయంలో అసలు కాంప్రమైజ్ కావడం లేదట.

మొత్తంగా మహేష్ చిత్ర బడ్జెట్ రూ. 800-1000 కోట్లు అట. యాక్షన్ అడ్వెంచర్ జోనర్ కావడంతో విదేశాలకు చెందిన సాంకేతిక నిపుణులు మహేష్ మూవీకి పని చేస్తారట. మహేష్ ఫ్యాన్స్ తో పాటు సగటు సినిమా అభిమాని మెస్మరైజ్ అయ్యేలా విజువల్ వండర్ గా తీర్చిద్దనున్నారట. ఇక మహేష్ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ సమకూరుస్తున్నారు. ఏడాది కాలంగా మూవీ స్క్రిప్ట్ మీద ఆయన పని చేస్తున్నారు. రాజమౌళి గత పాన్ ఇండియా చిత్రాలు బాహుబలి, బాహుబలి 2, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలకు స్క్రిప్ట్ అందించింది ఆయనే కావడం విశేషం.