
Nijam With Smita About Chandrababu: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలకంగా ఉన్న నలుగురు నేతలపై 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న మాజీ ముఖ్యమంత్రి, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన క్లారిటీతో ఉన్నారు. తన కొడుకు లోకే శ్ భవిష్యత్‌పైనా ఆయనకు ఎంతో విశ్వాసం ఉంది. తన అనుభవం ప్రకారం ఆ నలుగురిపై మనసులో మాటను బయటపెట్టారు బాబు. తనకు ఎన్నికల్లో ఓటమి కంటే బాధ కలిగించిన అంశాన్ని తెలిపారు. మొన్న బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో కీలక విషయాలు చెప్పిన చంద్రబాబు తాజాగా ‘నిజం విత్ స్మిత’ కార్యక్రమంలో కీలక అంశాలపై స్పందించారు. పవన్ కల్యాణ్ గురించి తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. కేటీఆర్ గురించి క్లారిటీ ఇచ్చారు. రేవంత్ తీరు ఎలా ఉంటుందో చెప్పుకొచ్చారు. లోకేశ్ పొలిటికల్ ఫ్యూచర్ గురించి స్పష్టంగా తేల్చి చెప్పారు. జాతీయ నేతల్లో తనకు ఇష్టమైన నేత ఎవరో కూడా వెల్లడించారు. కాలేజీ రోజుల నుంచి వైఎ్ససార్‌తో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
పవన్, లోకేశ్ గురించి..
నిజం విత్ స్మిత టాక్ షో లో భాగంగా చంద్రబాబు నాయుడు పవన్ గురించి మాట్లాడుతూ సమాజానికి ఏదో చెయ్యాలన్న తపన ఉన్న వ్యక్తిగా పేర్కొన్నారు. తన కుమారుడు లోకేశ్ పొలిటికల్ ఫ్యూచర్‌పై స్పష్టత ఇచ్చారు. లోకేష్ బాగా చదువుకోవటంతోపాటుగా సంస్కారం ఉన్న వ్యక్తిగా పేర్కొన్నారు. భవిష్యత్ ను నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉందని లోకేశ్‌పైనే ఉందని క్లియర్‌గా చెప్పారు.
కేటీఆర్ కమ్యూనికేటర్.. రేవంత్ డేరింగ్ పర్సన్..
ఉమ్మడి రాష్ట్రంలో తన మంత్రివర్గంలో పనిచేసిన, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తనయుడు కేటీఆర్ గురించి కూడా ఈ టాక్‌షోలో చంద్రబాబు స్పందించారు. కేటీఆర్ ఒక వ్యూహం ప్రకారం తాను అనుకున్నది సాధించటం కోసం పని చేసే వ్యక్తిగా అభిప్రాయపడ్డారు. బెస్ట్ కమ్యూనికేటర్ గా ప్రశంసించారు. ఇక.. టీడీపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి గురించి కూడా తన మనసులో మాట చెప్పారు. రేవంత్‌కు ధైర్యం ఎక్కువ అని, ఏ విషయంలో అయినా డేర్‌గా ముందుకు పోతారని చెప్పుకొచ్చారు. ప్రజల్లో ఇంకా నిరూపించుకోవాల్సి ఉందని తన అభిప్రాయంగా వెల్లడించారు.

అభిమాన నేత వాజ్‌పేయి.. అభిమాన హీరోయిన్ శ్రీదేవి..
ఇక ఈ టాక్‌షోలో జాతీయ నేతల్లో ఎవరంటే అభిమానం అన్న ప్రశ్నకు చంద్రబాబు తాను అభిమానించే జాతీయ నేతల్లో తొలి స్థానం వాజపేయికి ఇచ్చారు. తరువాత మన్మోహన్‌సింగ్, పీవీ నర్సింహారావు, ఇందిరాగాంధీగా చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు తన అభిమాన నటి ఎవరో బయటకు చెప్పని చంద్రబాబు.. తొలిసారి శ్రీదేవి గొప్ప నటిగా పేర్కొన్నారు. తన మామ ఎన్టీఆర్‌ను సినిమా హీరోగా కంటే రాజకీయ నాయకుడిగానే ఇష్టపడతానని చంద్రబాబు స్పష్టం చేశాారు.
ఓటమికంటే.. అదే బాధ కలిగించిందట..
2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఎంపీ సీట్లుల కూడా పెద్దగా రాలేదు. అయితే, తనకు ఎన్నికల్లో ఓటమి కంటే అమరావతి అంశమే అత్యంత బాధ కలిగించిందని ఈ షోలో బాబు ఆవేదన వ్యక్తం చేశారు. నాయకుడిగా ఎదగాలంటే ముందుగా విజన్.. తరువాత స్ట్రేటజీతో పాటుగా క్రమశిక్షణ.. కమ్యూనికేషన్.. రిలేషన్ బిల్డింగ్ ఉండాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
‘వెన్నుపోటు’ గురించి ఏమన్నారంటే..
1995 వెన్నుపోటు అంశం పైన మరోసారి చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. నాడు ఏం జరిగిందీ వివరించారు. నాడు ఆ ఘటనకు కారకులైన వ్యక్తులు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో చూస్తున్నారని.. వారి పేర్లు తాను చెప్పనని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ప్రేమ వ్యవహారాలు – వైఎస్సార్ తో బంధం గురించి..
చంద్రబాబు తన కాలేజీ రోజుల్లోని ప్రేమ వ్యవహారాల గురించి వివరించారు. ప్రేమ వ్యవహారాలు ఉన్నాయని.. కానీ, తక్కవేనని చెప్పారు. అందులో కొన్ని వన్‌సైడ్ ఉండొచ్చన్నారు. తాను గాఢమైన ప్రేమలో పడటం.. భగ్న ప్రేమికుడిగా మారటం జరగలేదన్నారు. ఇక.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌తో సన్నిహితంగా గడిపిన సందర్భాలను వెల్లడించారు. ఇద్దరం కాంగ్రెస్‌లో కలిసి పని చేశామన్నారు. 1995లో తాను సీఎం అయినా.. 2004లో వైఎస్ ముఖ్యమంత్రి అయినా.. రాజకీయంగానే విభేదించుకున్నామని చెప్పిన చంద్రబాబు.. వ్యక్తిగతంగా గౌరవించుకున్నామని చెప్పుకొచ్చారు. యూనివర్సిటీలో చదువుతూ.. ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన మొదటి వ్యక్తి దేశంలో తానొక్కడినే అనుకుంటానని చంద్రబాబు చెప్పారు.
మొత్తంగా నిజం విత్ స్మిత టాక్‌షోలో చంద్రబాబు పవన్.. కేటీఆర్.. రేవంత్.. లోకేష్ గురించి చెప్పిన అభిప్రాయాలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.