https://oktelugu.com/

Mahesh Babu: నటుడిగా మహేష్ కి 43ఏళ్ళు… ఆయన కెరీర్లో అరుదైన మైలురాళ్ళు!

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ సినీ ప్రస్థానం 43 ఏళ్ళు పూర్తి చేసుకుంది. నటుడిగా ఆయన మొదటి చిత్రం నీడ. 1979లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన నీడ మూవీలో మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు. అప్పటికి మహేష్ వయసు కేవలం నాలుగేళ్లు. ఊహ వచ్చాక ‘పోరాటం’ మూవీతో పూర్తి స్థాయిలో చైల్డ్ ఆర్టిస్ట్ అయ్యాడు. చైల్డ్ ఆర్టిస్ట్స్ లో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న మహేష్ చాలా ప్రత్యేకం. మూతి మీద మీసం రాకుండానే […]

Written By:
  • Shiva
  • , Updated On : November 29, 2022 / 07:08 PM IST
    Follow us on

    Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ సినీ ప్రస్థానం 43 ఏళ్ళు పూర్తి చేసుకుంది. నటుడిగా ఆయన మొదటి చిత్రం నీడ. 1979లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన నీడ మూవీలో మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు. అప్పటికి మహేష్ వయసు కేవలం నాలుగేళ్లు. ఊహ వచ్చాక ‘పోరాటం’ మూవీతో పూర్తి స్థాయిలో చైల్డ్ ఆర్టిస్ట్ అయ్యాడు. చైల్డ్ ఆర్టిస్ట్స్ లో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న మహేష్ చాలా ప్రత్యేకం. మూతి మీద మీసం రాకుండానే హీరో రోల్స్ చేశాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా డ్యూయల్ రోల్ చేసిన అరుదైన నటుడు మహేష్. తండ్రి, అన్నయ్యతో మల్టీస్టారర్ చేసిన ఘనుడు.

    Mahesh Babu

    చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇన్ని అరుదైన మైళ్ళు రాళ్లు మహేష్ చేరుకున్నారు. హీరోగా ఎంట్రీ ఇవ్వడం కోసం గ్యాప్ ఇచ్చిన మహేష్…రాజకుమారుడు మూవీతో కథానాయకుడిగా రంగప్రవేశం చేశాడు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1999 జులై 30న విడుదలైన రాజకుమారుడు సూపర్ హిట్ గా నిలిచింది. పలు సెంటర్స్ లో వంద రోజులు ఆడింది. ఫస్ట్ మూవీలోనే మహేష్ తన మార్క్ చూపించారు. ప్రీతి జింటా గ్లామర్, మణిశర్మ సాంగ్స్ యువతను ఊపేశాయి.

    కృష్ణకు తగ్గ నటవారసుడు అనిపించుకున్న మహేష్ తనని తాను మెరుగు పరుచుకుంటూ స్టార్ అయ్యాడు. టాప్ హీరోగా ఎదిగారు. జయాపజయాలతో సంబంధం లేకుండా తండ్రి కృష్ణ మాదిరి ప్రయోగాలు చేశారు. టక్కరి దొంగ, నాని, నిజం, స్పైడర్ మహేష్ ప్రయోగాత్మకంగా చేసిన చిత్రాలు. గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కిన ఒక్కడు ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ఇక 2006లో దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన పోకిరి బాక్సాఫీస్ షేక్ చేసి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది.

    Mahesh Babu

    ఆచితూచి సినిమాలు చేసే మహేష్ హీరోగా 27 చిత్రాలు చేశారు. అతిపెద్ద ఫ్యాన్ బేస్ కలిగిన మహేష్ బాబు రికార్డులకు మారుపేరుగా నిలిచారు. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ చిత్రం చేస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కాగా సెకండ్ షెడ్యూల్ కి సిద్దమవుతుంది. ఇక మహేష్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్న కాంబో… మహేష్-రాజమౌళి. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కనుంది. రాజమౌళి గత చిత్రాలకు మించి మహేష్ మూవీ ప్లాన్ చేస్తున్నారు.

    Tags