Scam in Movie Industry: ఈమధ్య కాలంలో భారీ బడ్జెట్ సినిమాలు టాలీవుడ్ లో ఎక్కువ అయిపోయాయి. అవసరం ఉన్నా లేకపోయినా కూడా అది కావాలి, ఇది కావలి అంటూ నిర్మాతల రక్తం తాగేస్తున్నారు కొంతమంది దర్శకులు. ఎన్నో కష్టనష్టాలను భరించి వాళ్ళు కోరినంత బడ్జెట్ ని ఇవ్వడం, కానీ వాళ్ళు మాత్రం పనికి మాలిన సన్నివేశాలను తీసి, వాటిని ఎడిటింగ్ లో తొలగించడం వంటివి చేస్తూ వస్తున్నారు. ఇలా రీసెంట్ గా సంక్రాంతికి విడుదలైన ఒక భారీ బడ్జెట్ సినిమాలో , సుమారుగా గంట నిడివి ఉన్న సన్నివేశాలను తొలగించారట. ఆ గంట నిడివి ఉన్న సన్నివేశాలను నిర్మించడానికి నిర్మాతకు అయిన ఖర్చు అక్షరాలా 75 కోట్ల రూపాయిలు. ఇదంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. ఇదంతా పక్కన పెడితే ఆ డైరెక్టర్ చూపించిన ఔట్పుట్ కి, నిర్మాత ఖర్చు చేసిన బడ్జెట్ కి అసలు సంబంధమే లేదు అన్నట్టుగా చూసే ఆడియన్స్ కి అనిపించింది.
సినిమా ఔట్పుట్ ని చూస్తుంటే కనీసం 100 కోట్ల బడ్జెట్ కూడా అయ్యినట్టుగా అనిపించడం లేదు, నిర్మాత ఏమో 300 కోట్లకు పైగా బడ్జెట్ ని ఖర్చు చేసినట్టు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో, ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చాడు, అసలు ఇంత బడ్జెట్ ఎలా సాధ్యం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ సైతం మాట్లాడుకున్నారు. నిర్మాతకు కూడా షూటింగ్ సమయం లోనే ఇలా ఎన్నో అనుమానాలు వచ్చాయట. షూటింగ్ మొత్తం పూర్తి అయ్యి , సినిమా విడుదలైన తర్వాత ఆడిట్ చేస్తే లెక్క తేలడం లేదట. వంద కోట్ల లూటీ అయ్యినట్టు ఆ నిర్మాత గమనించాడు . వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఆ చిత్ర డైరెక్టర్, మరియు అతని వెంట ఉంటూ ప్రచార కార్యక్రమాలు చూసుకునే మ్యానేజర్ బడ్జెట్ పేరుతో చేసిన మోసాన్ని మొత్తం బయట పెట్టాలని అనుకున్నాడట ఆ నిర్మాత.
కానీ కొంతమంది సినీ పెద్దలు ఇలాంటి సమయం లో ఏమి మాట్లాడొద్దు, చిత్రం లో నటించిన హీరో గారి మీద గౌరవం ఉంచి సైలెంట్ అయిపో, ఏదైనా గుట్టు చప్పుడు కాకుండానే ఈ వ్యవహారం తేలుద్దాం అని చెప్పడంతో, ఆ నిర్మాత కూడా సైలెంట్ అయిపోయాడట. కానీ ఎదో ఒక రోజు ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు కచ్చితంగా బడ్జెట్ పేరుతో ఆ దర్శకుడు,అతని మ్యానేజర్ చేసిన మోసాలను మొత్తం బయటపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ నిర్మాతని ఇంటర్వ్యూస్ లో కదిలిస్తే అన్నీ జరిగిన విషయాలు, వాస్తవాలను బోల్డ్ గా చెప్తుంటాడు. ఇప్పుడు కాకపోయినా ఎదో ఒక రోజు ఆయన అగ్నిపర్వతం లాగా బద్దలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇంతకీ ఏ సినిమా గురించి మాట్లాడుతున్నారు?, ఎవరు ఆ నిర్మాత అనేది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఇదంతా విన్న తర్వాత కచ్చితంగా ఇది ‘రాజా సాబ్’ గురించే అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ చర్చించుకుంటున్నారు.