Heroine Meena: సౌత్ ఇండియన్ టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో ఒకరిగా దశాబ్దానికి పైగా కొనసాగిన వారిలో ఒకరు..చిరంజీవి , బాలకృష్ణ , వెంకటేష్ మరియు నాగార్జున వంటి టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి నటించి ఎన్నో సూపర్ హిట్స్ ని అందుకున్న మీనా..ఆ తర్వాత కోలీవుడ్, మాలీవుడ్ లో కూడా స్టార్ హీరోల సరసన నటించి సౌత్ ఇండియా లోనే టాప్ మోస్ట్ హీరోయిన్ గా అతి తక్కువ కాలం లోనే పేరు తెచ్చుకుంది.

అయితే కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీ కి ఏడాదికి ఒకరు వస్తుండడం వల్ల మీనా కి హీరోయిన్ గా అవకాశాలు బాగా తగ్గిపోయాయి..ఇది ఇలా ఉండగా కెరీర్ పీక్ సమయం లోనే ఆమె 2009 వ సంవత్సరం లో విద్యా సాగర్ అనే బెంగళూరు కి చెందిన అబ్బాయి ని పెళ్లాడింది..వీళ్లిద్దరికీ ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు..అయితే రీసెంట్ గానే ఆయన చనిపోయిన ఘటన మీనా జీవితంలో అంధకారం ని నింపేసింది.
ఇప్పుడు ఇంటిని నడిపే బాధ్యత మొత్తం మీనా మీద పడడంతో సోషల్ మీడియా లో గత కొద్దీ రోజుల నుండి ఒక వార్త జోరుగా ప్రచారం అవ్వడం ప్రారంభం అయ్యింది..అదేమిటి అంటే మీనా రెండవ పెళ్లి చేసుకోబోతుందని..తన కుటుంబానికి దగ్గరైన ఒక వ్యక్తిని మీనాకి ఇచ్చి పెళ్లి చెయ్యడానికి కుటుంబ సభ్యులు ఆలోచిస్తున్నారని..ఇలా పలు రకాల వార్తలు షికార్లు చేసాయి..అయితే వీటిపై మీనా చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యింది.

‘డబ్బుల కోసం ఏది పడితే అది రాసేస్తారా..ఎవరు చెప్పారు మీకు నేను రెండవ పెళ్లి చేసుకుంటున్నాని..సోషల్ మీడియా మరీ దారుణంగా దిగజారిపోయింది..నా భర్త చనిపోయినప్పుడు కూడా సోషల్ మీడియా లో ఎన్నో తప్పుడు ప్రచారాలు వచ్చాయి..అవి ఇప్పటికి ఆగలేదు..ఇలాంటి వార్తలు పుట్టించే వారిపై కచ్చితంగా చర్యలు తీసుకునేలా చేస్తాను’ అంటూ మీనా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పెట్టిన ఆ ఒక పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.