
Kamal Haasan- Surya: గత ఏడాది విడుదలైన సినిమాలలో భారీ అంచనాల నడుమ విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన చిత్రం ‘విక్రమ్’.కమల్ హాసన్ హీరో గా నటించిన ఈ సినిమా సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. అన్నీ భాషలకు కలిపి సుమారుగా 450 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఈ చిత్రం, కమల్ హాసన్ కెరీర్ కి మరోసారి ఆయువు పోసింది అనే చెప్పాలి.
ఇక ఈ సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే, క్లైమాక్స్ మరో ఎత్తు. చివరి 5 నిమిషాలలో ‘రోలెక్స్’ అనే పాత్ర ద్వారా సూర్య పరిచయం అవుతాడు.ఆయన యాటిట్యూడ్ , నటన ఆ సన్నివేశాన్ని మరో లెవెల్ కి తీసుకెళ్లింది. ఒక విధంగా చెప్పాలంటే రోలెక్స్ పాత్ర ఈ చిత్రాన్ని మరో లెవెల్ కి తీసుకెళ్లింది అనే చెప్పాలి. ఈ పాత్ర గురించి రీసెంట్ గా జరిగిన ఒక వేడుక లో కమల్ హాసన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఆయన మాట్లాడుతూ ‘విక్రమ్ సినిమా చేస్తున్నప్పుడు రోలెక్స్ పాత్ర పెట్టాలనే ఆలోచన ముందుగా మాకు లేదు. లోకేష్ కి చివరి నిమిషం లో ఆ ఐడియా వచ్చింది. సూర్య కేవలం ఒక ఫోన్ కాల్ తోనే ఈ పాత్రని ఒప్పుకున్నాడు’అంటూ కమల్ హాసన్ చెప్పుకొస్తాడు. ఇక లోకేష్ కనకరాజ్ కూడా మాట్లాడుతూ ‘సూర్య తో సినిమా చెయ్యాలని ఎప్పటినుండో అనుకుంటూ ఉన్నాను, కుదర్లేదు కానీ త్వరలోనే ఆయనతో సినిమా చేయబోతున్నాను, కేవలం 150 రోజుల్లోనే ఆ చిత్రాన్ని పూర్తి చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

సూర్య కి గత కొంతకాలంగా సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు. ఆయన అభిమానులు సౌత్ ఇండియా షేక్ అయ్యే రేంజ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ చిత్రం ఇదేనని బలంగా నమ్ముతున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.ప్రస్తుతం ఆయన హీరో విజయ్ తో లేవు అనే సినిమా చేస్తున్నాడు, ఈ చిత్రం తర్వాత సూర్య తో సినిమా మొదలయ్యే అవకాశం ఉంటుంది.