Love In Wartime: ప్రేమ రెండక్షరాల పదం. ప్రపంచాన్నిశాసిస్తున్న వైనం. ఎవరైనా ప్రేమకు లొంగాల్సిందే. ప్రేమలో పడాల్సిందే. ప్రేమ చిగురించని మనసుండదు. ప్రేమించని వ్యక్తి కూడా ఉండడు. కాకపోతే ఆ ప్రేమను ఎలా దక్కించుకోవాలనేదే ప్రశ్న. కోరుకున్న అమ్మాయి ఒళ్లో వాలాలంటే చాలా తతంగమే ఉంటుంది. కొందరిది వనసైడ్ లవ్. అమ్మాయిని చూస్తారు. ప్రేమిస్తారు. కానీ విషయం చెప్పరు. దీంతో ఆ అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది. చివరకు దేవదాస్ గెటప్. ఇదంతా ఎందుకు ప్రేమిస్తే వెంటనే చెప్పేయాలి. ఆమె నిర్ణయం ఓకే అందంటే పండగే. నో అందంటే ఇక మనకు దండగే. ప్రేమను సాధించుకోవడం ఓ కల. అది అందరికి సాధ్యం కాదు. కొన్ని ప్రేమ జంటలే తమ ఆశయాన్ని నెరువేర్చుకుంటాయి. చాలా జంటలు త్యాగమే తరువాయని వారి కోరికలను చంపుకుని చివరకు ఎవరినో ఒకరిని చేసుకుని జీవితాంతం బాధపడుతుంటారు.

కానీ ఇక్కడో ప్రేమికుడు అలా చేయలేదు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కాలు పోగొట్టుకున్నా తన కోరికను వదులుకోలేదు. తన ప్రేయసిని చేరాలని కోరుకున్నాడు. తన మనసులోని మాటను నిరభ్యంతరంగా వెల్లడించాడు. నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉందని తన మనసులోని మాటను వ్యక్తం చేశాడు. దీనికి ఆమె కూడా సమ్మతించింది. ప్రేమికుడి నిజాయితీకి నిలువెల్లా పులకరించింది. కాలు లేకున్నా అతడి సాహసానికి మురిసిపోయింది. శరీరానికి వైకల్యం ఉంటే ఏమిటి మనసు బాగా ఉంటే సరిపోతుందనే ఉద్దేశంతో అతడి ప్రేమను ఓకే అనేసింది.
Also Read: Koratala Siva- NTR: షాక్.. ఆ స్టార్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ మూవీ ఆగిపోయింది?
దీంతో దీనికి సంబంధించిన వీడియో ప్రసార మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రేమికుడు సాహసానికి ప్రియురాలు కూడా ముగ్దురాలవుతోంది. అతడిని ప్రేమగా దగ్గరకు తీసుకుని ముద్దు కూడా పెట్టింది. ఇంకా ఏముంది అతడి సంతోషానికి అవధుల్లేవు. అతడి ఆనందానికి పట్టపగ్గాల్లేవు. దీనికి నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. నిజమైన ప్రేమకు అడ్డంకులు ఉండవు. ఎటు చూసినా ఆక్షేపణలు రావు. ఇద్దరి మనసుల స్వచ్ఛమైన కలయిక ప్రేమ. అందులో నిజాయితీ ఉంటే అదే మిమ్మల్ని కలుపుతుంది.
ప్రకృతిలో ప్రేమకు లొంగనిది ఏదీ ఉండదు. అది చెట్టయినా, పుట్టయినా ఆఖరుకు మనిషైనా సరే ప్రేమిస్తే అంతే. ఒకసారి ప్రేమలో పడితే జీవితాంతం ఇక వారితోనే జత కట్టేందుకు నిర్ణయించుకుంటారు. వారితోనే కలకాలం తోడు నీడగా ఉండటానికి ఇష్టపడతారు. అదే నిజమైన ప్రేమ. అంతేకాని పార్కుల్లో , సినిమా హాళ్లు, హోటళ్లలో చాటుగా కలుసుకుని దాన్ని ప్రేమగా చెప్పుకుంటే కుదరదు. ప్రేమిస్తే నిలబడాలి. ఆమెకు జీవితాన్ని ఇవ్వాలి. అప్పుడే దానికి ఓ విలువ ఉంటుంది. అదే నిజమైన ప్రేమగా గుర్తింపు తెచ్చుకుంటుందనడంలో సందేహం లేదు.
View this post on Instagram
[…] Also Read: Love In Wartime: ఇది కదా స్వచ్ఛమైన ప్రేమంటే..? […]