Koratala Siva- NTR: ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదలై ఆరు నెలలు దాటిపోయింది. ఎన్టీఆర్ కొత్త ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టలేదు. రెండు చిత్రాలు ప్రకటించినా ఒక్కటి కూడా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఆర్ ఆర్ ఆర్ లో మరో హీరోగా చేసిన రామ్ చరణ్ దర్శకుడు శంకర్ మూవీని సగానికి పైగా పూర్తి చేశాడు. ఆర్ ఆర్ ఆర్ మూవీ కోసం నాలుగేళ్ల సమయం కేటాయించిన ఎన్టీఆర్ మరలా ఇలా గ్యాప్ తీసుకోవడం ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. ఎన్టీఆర్ తన నెక్స్ట్ మూవీ దర్శకుడు కొరటాల శివతో కమిటైన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ 30వ చిత్రంగా ఇది తెరకెక్కుతుంది. ఎన్టీఆర్-30 ప్రీ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. సినిమా మాత్రం సెట్స్ పైకి వెళ్లడం లేదు.

ఆచార్య డిజాస్టర్ నేపథ్యంలో స్క్రిప్ట్ పక్కాగా ప్రిపేర్ చేయాలని కొరటాలను ఎన్టీఆర్ సూచించాడు. దీని కోసం కొరటాల కొంత సమయం తీసుకున్నారు. ఒక ప్రక్క సమయం గడిచిపోతుంది, ప్రాజెక్ట్ పట్టాలెక్కడం లేదు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ హోల్డ్ లో పెట్టినట్లు ఓ షాకింగ్ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఇటీవల కొరటాల ఫైనల్ స్క్రిప్ట్ ఎన్టీఆర్ కి నేరేట్ చేశారట. కొరటాల చెప్పిన అప్డేటెడ్ వర్షన్ కూడా ఎన్టీఆర్ ని ఇంప్రెస్ చేయలేకపోయిందట.
మరింత మెరుగు పరచాలని సూచించాడట. లేదంటే ఒక కొత్త స్టోరీ లైన్ తో స్క్రిప్ట్ సిద్ధం చేయమన్నారట. ఈ రెండు కండిషన్స్ లో కొరటాల ఏది ఎంచుకున్నా మరి కొంత సమయం పట్టడం ఖాయం. ఈ క్రమంలో ఎన్టీఆర్-కొరటాల మూవీ ప్రస్తుతానికి లేనట్లే అంటున్నారు. ఈ పుకార్లలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. అదే కనుక నిజమైతే కొరటాల శివకు బిగ్ షాక్ తగిలినట్లే.

ఆచార్య డిజాస్టర్ కొరటాలను అగాధంలోకి నెట్టింది. ఇప్పటి వరకు సంపాదించుకున్న ఇమేజ్ డామేజ్ చేసింది. అలాగే ఆర్థికంగా భారీ దెబ్బతీసింది. ఆస్తులు అమ్మి కొరటాల బయ్యర్లకు డబ్బులు చెల్లించాడు. మరోవైపు చిరంజీవి కొరటాల పట్ల చాలా అసహనంగా ఉన్నారు. ఎన్టీఆర్ మూవీతో కమ్ బ్యాక్ కావాలని కొరటాల భావిస్తుండగా… ఈవార్తలు కలవర పెడుతున్నాయి. ఒకవేళ కొరటాలతో మూవీ ఆగిపోతే ఎన్టీఆర్ నెక్స్ట్ బాగా లేట్ అవుతుంది. లేదంటే ప్రశాంత్ నీల్ మూవీ మొదలయ్యే లోపు ఉప్పెన బుచ్చిబాబుతో మూవీ చేసే అవకాశం కలదు.
[…] […]
[…] […]