Sarfaraz Khan: చిరుతవేగం, పులి పంజా, ఏనుగు బలం, సింహం చూపు.. ఈ ఉపమానాలు కూడా అతడి ఆట తీరును పోల్చాలంటే సరిపోవు కావచ్చు. అంతలా ఆడుతున్నాడు మరి. ఫోర్లు సులభంగా కొట్టేస్తున్నాడు. సిక్సర్లు అవలీలగా బాదేస్తున్నాడు. ఇక సింగిల్స్, డబుల్స్ అయితే మెరుపు వేగంతో తీస్తున్నాడు. అతడి ఆట తీరుకు మిస్టర్ 360 డిగ్రీస్ గా పేరొందిన సూర్య కుమార్ ఫిదా అయ్యాడు. ఇంతకీ ఎవరు ఆ ఆటగాడు? ఏంటి అతడి ప్రత్యేకత? ఇంత చదివాక ఇంకా ఎందుకు ఆలస్యం.. లేదు మిగతాది కూడా చదివేస్తే ఓ పనైపోతుంది కదా!

మంచినీళ్లు తాగినంత సులభంగా కొట్టేస్తున్నాడు
సర్ప రాజ్ ఖాన్. వయసు 24 ఏళ్ళు. రంజీలో ముంబై జట్టుకు ఆడుతున్నాడు.ఈ ఏడాది రంజి ట్రోఫీలో సెంచరీల మోత మోగించాడు. తన కెరీర్ లోనే అత్యున్నత ఫామ్ ను కనబరుస్తున్నాడు. ఇటీవల దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో సెంచరీ తో మెరిశాడు. తాజాగా ఇరానీ కప్ లోనూ తన హవా సాగించాడు. కేవలం 92 బంతుల్లోనే శతకం సాధించాడు. ఈ ఇన్నింగ్స్ లో 29 ఫోర్లు, 2 సిక్సర్ల తో 138 పరుగులు చేశాడు. కానీ ఇతడి ఘనత ఇక్కడతో ఆగిపోలేదు. ఇంతటితో ఆగిపోయేది కూడా కాదు. ఎందుకంటే అతను ఆడుతున్న తీరు చూస్తే జింకలను వేటాడుతున్న పులి గుర్తుకొస్తోంది. బలమైన ఫోర్ హాండ్ షాట్లు, టెక్నిక్ తో కూడిన స్వీప్ షాట్లు, కవర్ డ్రైవ్లు, ఫ్రంట్ పుట్ కు వచ్చి ఆడే స్ట్రైట్ షాట్లు.. ఇలా ఒక్కటేమిటి బంతిని మైదానం నలుమూలల కసిగా బాదుతున్నాడు. ఇతడి ఆట తీరుకు ముగ్ధు డైన సూర్య కుమార్ యాదవ్ ” నీతో కలిసి ఆడేందుకు ఎదురుచూస్తున్నానని” ట్వీట్ చేశాడు. ఇటీవల జరిగిన రంజీ ట్రోఫీలో అతని ఆట తనను అమితంగా ఆకట్టుకుందని సూర్య కుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
Also Read: Love In Wartime: ఇది కదా స్వచ్ఛమైన ప్రేమంటే..?
బ్రాడ్ మన్ ను మించిపోయాడు
క్రికెట్ స్వరూపం మారుతున్నది. భవిష్యత్తులో ఇంకా ఎలా మారుతుందో చెప్పలేం. కానీ క్రికెట్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించగలిగిన అధ్యాయం సర్ బ్రాడ్ మన్. ఈ ఆస్ట్రేలియా ఆటగాడు సాధించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. సచిన్ టెండూల్కర్ అనే ముంబై ఆటగాడు వచ్చేంతవరకు ఇతడి రికార్డులు అప్పటివరకు పదిలంగా ఉన్నాయి. తన చరమాంకంలో సచిన్ ను దగ్గరకి రప్పించుకుని సచిన్ తో ముచ్చటించారు. అతడు ఆడే ఎం ఆర్ ఎఫ్ బ్యాట్ పై ఆటోగ్రాఫ్ చేశాడు. ఇప్పుడు రంజీలో దుమ్ము దులుపుతున్న సర్ఫ రాజ్ కూడా ముంబై ఆటగాడే కావడం గమనార్హం. సర్ఫరాజ్ ఇప్పటివరకు 43 ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. 2,928 పరుగులు చేశాడు. ఇరానీ ట్రోఫీలో సౌరాష్ట్ర పై చేసిన 138 పరుగులు అతడి అత్యుత్తమ స్కోర్. అతడి ఆట తీరుకు బ్రాడ్ మన్ రికార్డు బద్దలైపోయింది. బ్రాడ్ మన్ 43 ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్ లో 2,927 పరుగులు చేశారు. అయినప్పటికీ సర్పరాజ్ ఇండియన్ క్రికెటర్ వినోద్ కాంబ్లీ రికార్డును అధిగమించలేకపోయారు. వినోద్ 43 ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్ ల్లో 3019 పరుగులు చేశాడు. వినోద్ కాంబ్లీ కెరియర్ ను అద్భుతంగా మొదలుపెట్టాడు.

సచిన్ కంటే కూడా గొప్పగా ఆడేవాడు. ఆట వల్ల వచ్చిన గౌరవాన్ని అహంకారంగా మార్చుకున్నాడు. క్రమశిక్షణ కోల్పోయి దురుసుతనాన్ని నెత్తిన ఎక్కించుకున్నాడు. ఫలితంగా ఎంతో విలువైన కెరియర్ ను నాశనం చేసుకున్నాడు. ప్రస్తుతం బీసీసీఐ ఇచ్చే 30 వేల పెన్షన్తో బతుకు బండిని లాగిస్తున్నాడు. కనీసం ఉండేందుకు సొంత ఇల్లు కూడా లేక అద్దె ఇంట్లో ఉంటూ నానా ఇబ్బందులు పడుతున్నాడు. అయితే సర్పరాజ్ ఆట చూసి ముద్దుడైన భారత క్రికెట్ కోచ్ రాహుల్ ద్రావిడ్.. త్వరలో అతడిని జాతీయ జట్టులోకి తీసుకోవాలని భావిస్తున్నాడు. కాగా త్వరలో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టి20 వరల్డ్ కప్ కు సర్ప రాజ్ ను ఎంపిక చేయాల్సి ఉండగా.. అతడు రంజీ ట్రోఫీలో ఆడుతుండడంతో విరమించుకున్నాడు. అతి కొద్దిరోజుల్లోనే సర్ప రాజ్ జాతీయ జట్టులోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి.