ఎల్‌ఐసీ సూపర్ పాలసీ.. జీవించినంత కాలం ప్రతి నెలా చేతికి రూ.4,500!

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్తకొత్త పాలసీలను అందుబాటులోకి తెస్తూ కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూర్చే దిశగా ఎల్‌ఐసీ అడుగులు వేస్తోంది. జీవన్ అక్షయ్ పాలసీ ద్వారా ఎల్‌ఐసీ కస్టమర్లకు ప్రతినెలా 4,500 రూపాయలు పొందే అవకాశం కల్పిస్తోంది. సింగిల్ ప్రీమియం నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ పర్సనల్ యాన్యూటీ ప్లాన్ ప్లాన్ అయిన జీవన్ అక్షయ్ పాలసీ ద్వారా […]

Written By: Navya, Updated On : November 30, 2020 6:15 pm
Follow us on

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్తకొత్త పాలసీలను అందుబాటులోకి తెస్తూ కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూర్చే దిశగా ఎల్‌ఐసీ అడుగులు వేస్తోంది. జీవన్ అక్షయ్ పాలసీ ద్వారా ఎల్‌ఐసీ కస్టమర్లకు ప్రతినెలా 4,500 రూపాయలు పొందే అవకాశం కల్పిస్తోంది.

సింగిల్ ప్రీమియం నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ పర్సనల్ యాన్యూటీ ప్లాన్ ప్లాన్ అయిన జీవన్ అక్షయ్ పాలసీ ద్వారా ప్రతి నెలా సులభంగా 4,500 రూపాయలు పొందవచ్చు. ప్రజల్లో ఎల్‌ఐసీపై విశ్వాసం ఎక్కువ కాబట్టి ఎన్ని కంపెనీలు వచ్చినా ఎల్‌ఐసీ ఇచ్చే స్థాయిలో ప్రయోజనాలను ఇవ్వలేకపోతున్నాయి. ఎల్‌ఐసీ పాలసీ తీసుకున్న కస్టమర్లకు ఆర్థిక భద్రత దక్కడంతో పాటు సులభంగా ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడం సాధ్యమవుతుంది.

Also Read: ఎయిర్ టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్.. ఉచితంగా 5జీబీ డేటా..?

ఎల్‌ఐసీ జీవన్ అక్షయ్ పాలసీ ద్వారా రిటైర్మెంట్ తర్వాత కూడా ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. 30 నుంచి 85 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు 10 రకాల ఆప్షన్లలో ఏదో ఒక ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. 9,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెలా కస్టమర్లు 4,500 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ఎంత ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే అంత ఎక్కువ ఆదాయం పొందవచ్చు.

Also Read: అమెజాన్ పై బ్యాన్ విధించాలంటున్న వ్యాపారులు.. ఏం జరిగిందంటే..?

అయితే పాలసీదారుడు చనిపోయిన తరువాత మాత్రం ఈ పాలసీ ద్వారా ఎటువంటి ప్రయోజనాలను పొందలేరు. జీవించి ఉన్నంత కాలం పెన్షన్ పొందే అవకాశం ఉండటంతో ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిటైర్మెంట్ తర్వాత సంతోషకరమైన జీవనం గడపవచ్చు.

మరిన్ని వార్తల కోసం: వ్యాపారము