https://oktelugu.com/

గుడ్డు పెంకులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?

మనలో చాలామంది గుడ్డును ఎంతో ఇష్టంగా తింటారనే సంగతి తెలిసిందే. మన శరీరానికి కావాల్సిన పోషకాలు, ప్రోటీన్లు, విటమిన్లు గుడ్డు నుంచి లభిస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు ప్రతిరోజూ గుడ్డు తీసుకుంటే వాళ్లలో వేగంగా పెరుగుదల ఉంటుంది. గుడ్డులో కొందరు తెల్లసొన మాత్రమే తినాలని పచ్చసొన తినకూడదని అనుకుంటూ ఉంటారు. కానీ తెల్లసొనతో పాటు పచ్చసొనను కూడా తింటేనే మంచిదని వైద్యులు వెల్లడిస్తున్నారు. Also Read: రైస్ కుక్కర్ లో వండిన అన్నం తినే వారికి షాకింగ్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 30, 2020 / 03:45 PM IST
    Follow us on

    మనలో చాలామంది గుడ్డును ఎంతో ఇష్టంగా తింటారనే సంగతి తెలిసిందే. మన శరీరానికి కావాల్సిన పోషకాలు, ప్రోటీన్లు, విటమిన్లు గుడ్డు నుంచి లభిస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు ప్రతిరోజూ గుడ్డు తీసుకుంటే వాళ్లలో వేగంగా పెరుగుదల ఉంటుంది. గుడ్డులో కొందరు తెల్లసొన మాత్రమే తినాలని పచ్చసొన తినకూడదని అనుకుంటూ ఉంటారు. కానీ తెల్లసొనతో పాటు పచ్చసొనను కూడా తింటేనే మంచిదని వైద్యులు వెల్లడిస్తున్నారు.

    Also Read: రైస్ కుక్కర్ లో వండిన అన్నం తినే వారికి షాకింగ్ న్యూస్..?

    అయితే చాలామంది గుడ్డు పెంకులను మాత్రం పారవేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఒక అధ్యయనంలో గుడ్డు పెంకులను కూడా తినాలని.. గుడ్డు పెంకులను తింటే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చేకూరుతాయని తేలింది. అయితే గుడ్డు పెంకులను గుడ్లతో కలిపి మాత్రం తీసుకోకూడదు. గుడ్లను, గుడ్డు పెంకులను వేర్వేరుగా తీసుకుంటే మాత్రమే మనం ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందగలుగుతాము.

    Also Read: కడుపునొప్పిని సులువుగా తగ్గించుకోవడానికి పాటించాల్సిన చిట్కాలివే..?

    శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో గుడ్డు పెంకుల్లో క్యాల్షియం ఉంటుందని తేలింది. క్యాల్షియం ఉన్న గుడ్లను తీసుకోవడం వల్ల దంతాలు, ఎముకలు బలంగా ఉంటాయి. చాలామంది గుడ్ల పెంకులు వేస్ట్ అని భావించినా మన శరీరానికి అవసరమైన పొషకాలన్నీ గుడ్ల పెంకుల ద్వారా మనకు లభిస్తాయి. విటమిన్ డి లోపంతో బాధ పడుతున్న వాళ్లు రోజూ గుడ్ల పెంకులు తీసుకుంటే ఆ సమస్యకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది.

    మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

    అయితే ఈ పెంకులను వేడినీటిలో అరగంట పాటు మరిగించి తీసుకుంటే గుడ్డు పెంకుపై ఉండే బ్యాక్టీరియా, క్రిములు చనిపోతాయి. గుడ్డు పెంకులను పొడిగా చేసుకుని పిజ్జా, పాస్తా లాంటి వాటిలో వేసుకుని తింటే అవి మరింత రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి.