https://oktelugu.com/

బిగ్ బాస్-4: అవినాష్ ను బలి చేశారా.. ఓటింగ్ పై అనుమానాలు..!

తెలుగు రియల్టీ షోలలో ‘బిగ్ బాస్’ నెంబర్ వన్ గా కొనసాగుతోంది. కరోనా టైంలోనూ బిగ్ బాస్ నిర్వాహాకులు నాలుగో సీజన్ ప్రారంభించి బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్-4 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. డిసెంబర్ 20న గ్రాండ్ ఫినాలే నిర్వహించేందుకు బిగ్ బాస్ ఏర్పాట్లు చేస్తున్నాడు. 12వ వారం తొలి నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్లకు షాకులు మీద షాకిలిస్తున్నాడు. 12వ వారం నామినేషన్లలో మొనాల్ గజ్జర్.. అఖిల్.. అరియానా.. అవినాష్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 30, 2020 / 03:28 PM IST
    Follow us on

    తెలుగు రియల్టీ షోలలో ‘బిగ్ బాస్’ నెంబర్ వన్ గా కొనసాగుతోంది. కరోనా టైంలోనూ బిగ్ బాస్ నిర్వాహాకులు నాలుగో సీజన్ ప్రారంభించి బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్-4 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. డిసెంబర్ 20న గ్రాండ్ ఫినాలే నిర్వహించేందుకు బిగ్ బాస్ ఏర్పాట్లు చేస్తున్నాడు.

    12వ వారం తొలి నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్లకు షాకులు మీద షాకిలిస్తున్నాడు. 12వ వారం నామినేషన్లలో మొనాల్ గజ్జర్.. అఖిల్.. అరియానా.. అవినాష్ లు ఉన్నారు. వీరిలో శనివారమే మొనాల్.. అఖిల్ సేఫ్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. దీంతో ఎలిమినేషన్స్ లో అరియానా.. అవినాష్ మాత్రమే మిగిలారు.

    Also Read: అల్లు అర్జున్ బిగ్ గోల్స్.. విలక్షణంగా మారనున్నాడా?

    అయితే 12వ వారం టాస్కులో గెలిచిన అవినాష్ వచ్చే వారానికి ఇమ్యూనిటీ గెలుచుకున్నాడు. అతడు ఎలిమినేషన్స్ ఉండటంతో ఎవిక్షన్ పాస్ ఉపయోగించుకొని ఈ వారం ఎలిమినేషన్స్ నుంచి తప్పించుకున్నాడు. అయితే అతడికి బిగ్ బాస్ అనుహ్యంగా షాకిచ్చాడు. అవినాష్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించడంతో అతడు హౌస్ నుంచి నిరాశగా బయటికి వెళ్లాడు.

    Also Read: తండ్రిని.. అన్నను తలుచుకొని నాగబాబు ఎమోషనల్

    అవినాష్ ఎలిమినేషన్ కు ముందు హోస్ట్ నాగార్జున అతడిని ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడుకుంటావా? అని ప్రశ్నించాడు. దీనికి అతడు ఒకే చెప్పడంతో అతడు ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు. అనినాష్ సేఫ్ అయిన తర్వాత ప్రేక్షకుల ఓటింగులో ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది పరిశీలించారు. ఇందులో అరియానా ఎక్కువగా ఓట్లురాగా అవినాష్ తక్కువ ఓట్లు వచ్చాయి.

    మరిన్ని వార్తల కోసం: సినిమా

    దీంతో అవినాష్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉపయోగించుకొని సేఫ్ అయినప్పటికీ అరియానా కంటే తక్కువ ఓట్లు రావడంతో ఎలిమినేషన్ అయ్యాడు. దీంతో అతడు నిరాశకు గురయ్యాడు. ఆ తర్వా అనివాష్ మాట్లాడుతూ ప్రేక్షకుల అభిప్రాయంలో నేను ఎలిమినేట్ అయిపోయినట్టే.. ముందుకు వెళ్లాలా ఆగాలా తెలియడం లేదని వాపోయాడు.

    ‘ఎంత ఆడినా..’ అంటూ ఓటింగ్ సిస్టమ్‌పై పరోక్షంగా అనుమానాలు వ్యక్తం చేశాడు. దీంతో నాగార్జున అతడిని ఓదార్చే ప్రయత్నం చేశాడు. దీంతో మరోసారి ఓటింగ్ సిస్టంపై అభిమానుల్లో అనుమానాలు రేకెత్తాయి. అవినాష్ కు కావాలనే బిగ్ బాస్ బలి చేశాడంటూ కామెంట్స్ విన్పిస్తున్నాయి.