Homeట్రెండింగ్ న్యూస్Jo Lindner Passed Away: 36 ఏళ్ల ప్రముఖ బాడీ బిల్డర్ మృతి.. అతిగా ఎక్సర్సైజ్,...

Jo Lindner Passed Away: 36 ఏళ్ల ప్రముఖ బాడీ బిల్డర్ మృతి.. అతిగా ఎక్సర్సైజ్, బాడీ బిల్డింగ్ ఇంత ప్రమాదమా..?

Jo Lindner Passed Away: ఫిట్నెస్ పై దృష్టి సారిస్తున్న యువత సంఖ్య పెరుగుతుంది. బాడీ షేపింగ్ కోసం గంటల తరబడి యువత జిమ్ముల్లో కష్టపడుతున్నారు. శారీరకంగా ఫిట్ గా ఉండేందుకు చేసే విపరీతమైన వ్యాయామాలు కూడా ప్రమాదకరంగా మారుతున్నాయి. ముఖ్యంగా బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొన్న యువత శరీరంలోని నీటి నిలువలు తగ్గించుకునేందుకు చేసే ప్రక్రియ ప్రమాదకరంగా పరిణమిస్తోంది. ఇదే విధంగా జర్మనీకి చెందిన ప్రముఖ బాడీ బిల్డర్, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ జో లిండ్నర్ (30) మృతి చెందడం ఇప్పుడు అందరిని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.

ఫిజికల్ ఫిట్నెస్ కోసం యువత ఈ మధ్యకాలంలో ఎక్కువగా ట్రైనర్స్ ఆధ్వర్యంలో జిమ్ లో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. అయితే పరిధికి మించి చేసే వ్యాయామం, బాడీ బిల్డింగ్ పోటీల్లో విజయం సాధించేందుకు అనుసరించే కొన్ని పద్ధతులు ప్రమాదానికి హేతువులుగా మారుతున్నాయి. జర్మనీకి చెందిన ప్రముఖ బాడీ బిల్డర్ జో లిండ్నర్ మూడు రోజుల క్రిందట అరుదైన వ్యాధితో స్నేహితురాలు నిచా సమక్షంలో ప్రాణాలను కోల్పోయాడు. ఈ విషయాన్ని నిచా ఇన్స్ స్టాగ్రామ్ లో వెల్లడించింది. మెడ నొప్పితో బాధపడిన మూడు రోజుల్లోనే కన్నుమూసినట్లు స్పష్టం చేసింది.

కండరాలు తీవ్రమైన ఒత్తిడికి గురి కావడంతోనే సమస్య..

జో లిండ్నర్ ప్రపంచంలోనే పేరు గాంచిన బాడీ బిల్డర్. దుబాయ్, థాయిలాండ్ లో ఫిట్నెస్ వీడియోలు చిత్రీకరించి ఆన్లైన్లో పోస్ట్ చేస్తుంటాడు. ఆ వీడియోలు అతనికి చాలా పేరు తీసుకువచ్చాయి. అయితే, శారీరకంగా ఫిట్ గా ఉండే క్రమంలో ప్రతిరోజు గంటల తరబడి న్యాయం చేయడం వల్ల, బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొనే క్రమంలో వినియోగించే కొన్ని రకాల స్టెరాయిడ్స్, అనుసరించే కొన్ని పద్ధతులు వల్ల అతడు అరుదైన వ్యాధి బారిన పడ్డాడు. జో లిండ్నర్ రిఫ్లింగ్ మజిల్ డిసీజ్ అనే వ్యాధి బారిన పడ్డాడు. ఈ వ్యాధి బారిన పడిన వ్యక్తికి కండరాలు ఒత్తిడికి గురైన సమయంలో భిన్నంగా స్పందిస్తాయి. సాధారణంగా కండరంపై ఒత్తిడి పెంచితే ఒక రకమైన రసాయనిక చర్య ద్వారా అవి మొత్తం ఒక చోటకు చేరి బలంగా కనిపిస్తాయి. కానీ, రిఫ్లింగ్ మజిల్ డిసీజ్ ఉన్న వారిలో కండరాలు విపరీతమైన ఒత్తిడికి గురై ఒకే కండరంలా కాకుండా వేరువేరుగా అలలు వలే మారిపోతాయి. ఇలా కనీసం 20 సెకండ్ల వరకు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో క్రాంప్ ఏర్పడి విపరీతమైన నొప్పికి కారణం అవుతుంటాయి. జో లిండ్నర్
తరచూ ఈ సమస్య గురించి గతంలో ప్రస్తావించేవాడు. గుండె కూడా కండరమే కాబట్టి, తన గుండెకు క్రాంప్ వస్తే ఎలా అన్నది తన భయమని, ఈ ఆలోచన భయపెడుతోందని, అందుకే తాను వీలైనంత ఎక్కువగా బాడీ బిల్డింగ్ పోటీలకు దూరంగా ఉంటున్నట్టు గతంలో జో లిండ్నర్ అనేకసార్లు
స్పష్టం చేశాడు.

డీహైడ్రేషన్ వల్ల క్రాంప్ సమస్య..

బాడీ బిల్డింగ్ పోటీల్లో కండరాలను మరింత ఆకర్షణీయంగా ప్రదర్శించేందుకు శరీరంలో నీటిని బయటకు పంపించేస్తుంటారు. ఇందుకోసం ఎక్కువగా మూత్ర విసర్జన చేయాల్సి ఉంటుంది. దీనికోసం కూడా స్టెరాయిడ్స్ వాడుతుంటారు. మూత్ర విసర్జన ఎక్కువ చేయడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడాల్సి వస్తుంది. జో లిండ్నర్ ప్రస్తావించిన క్రాంప్ సమస్య డిహైడ్రేషన్ వల్ల వస్తుందని నిపుణులు చెబుతున్నారు. గతంలో మహమ్మద్ బెనా జీజా అనే బాడీ బిల్డర్ కూడా పోటీలు అనంతరం ఇటువంటి సమస్యతోనే ప్రాణాలను కోల్పోయాడు. ఇతడి శరీరం కూడా విపరీతంగా నీటిని కోల్పోవడంతో మరణం సంభవించినట్లు శవ పరీక్షలో తేలింది. అయితే, జో లిండ్నర్ మరణానికి గల కారణం అధికారికంగా తెలియాల్సి ఉంది. దాదాపుగా ఇదే కారణం వల్ల జో చనిపోయి ఉండవచ్చని చెబుతున్నారు. అయితే, ఫిట్ గా కనిపించేందుకు, బాడీ పోటీల్లో పాల్గొనేందుకు తీవ్రంగా కసరత్తు చేసే యువకులు, శరీరంలో నీటి నిల్వలు తగ్గించుకునే ప్రయత్నం చేసేవాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే ఈ తరహా ప్రమాదాలు బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జో లిండ్నర్ మృతి.. ఈ తరహా యాక్టివిటీస్ చేసే వారికి ఒక హెచ్చరికగా కనిపించాలని పలువురు సూచిస్తున్నారు.

Exit mobile version