
AP Police: ఏపీలో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయి. అయితే అవి సంఘ విద్రోహ శక్తులు వల్ల కాదు. సాక్షాత్ అధికార వైసీపీ నేతల వల్లే. ప్రశ్నించడాన్ని తట్టుకోలేకపోతున్నారు. విపక్షాల గొంతు నొక్కుతున్నారు. కేసులు, అరెస్ట్ లతో భయపెడుతున్నారు. ఇప్పుడు నేరుగా దాడులకే దిగుతున్నారు. విపక్ష నేతల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. అయితే వీటిన్నింటికీ సాక్షాధారాలు ఉన్నా.. పోలీసులు పట్టకుండా వ్యవహరిస్తున్నారు. దాడులు చేసేవారికి అండగా నిలబడుతున్నారు. బాధితులపై తిరిగి కేసులు నమోదుచేస్తున్నారు. మరో అడుగు ముందుకేసి ఆరాచక శక్తులను అండగా ఉండడంతో పాటు కొందరు పోలీసులే ఫిర్యాదుదారులుగా మారుతున్నారు. అయితే ఇదో పద్ధతి ప్రకారం జరుగుతున్న కుట్రగా అనుమానాలున్నాయి. పోలీస్ వ్యవస్థపై అపనమ్మకం కలిగించి.. అదే వ్యవస్థతో సమాజాన్ని భయపెట్టి తమ గుప్పెట్లో లాక్కునే రాజకీయ క్రీనీడకు తెరతీశారన్న అనుమానాలైతే బలపడుతున్నాయి.
గత నాలుగేళ్లుగా ఏదైన సంచల ఘటనలు జరిగినప్పుడు పోలీసులకు ఒక రకమైన ఆదేశాలు వస్తాయి. దీనిపై పోలీసులే అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నారు. ఇటీవల టీడీపీ నేతలపై నేరుగా పోలీసులే ఫిర్యాదులు చేస్తున్నారు. హత్యాయత్నం కేసులు పెడుతున్నారు. తమ కళ్లెదుటే దాడులు, దాహనాలు, విధ్వంసాలకు దిగుతున్న వారిపై కేసులు నమోదుచేయడంలేదు. ప్రతిఘటిస్తున్న వారిపై కేసులు నమోదుచేసి లోపల వేస్తున్నారు. గన్నవరంలో టీడీపీ ఆఫీసుపై దాడి జరిగిందని పట్టాభి వెళ్లారు. కానీ ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన కారుపై దాడిచేసినట్టు ఆరోపణలున్నాయి. సుమారు 20 గంటల పాటు ఆయన్ను ఎక్కడికి తీసుకెళ్లారో బయటప్రపంచానికి తెలియలేదు. ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్టు ప్రచారం జరుగుతోంది. కానీ ఇంతటి విధ్వంసం జరిగినా ఒక్క వైసీపీ కార్యకర్తపైనా కేసు నమోదుచేయలేదు.
విశాఖ ఎయిర్ పోర్టు ఘటన మంత్రి రోజా రెచ్చగొట్టడం వల్లే జరిగింది. ఆమె మిడిల్ ఫింగర్ చూపిస్తూ జనసేన శ్రేణులను రెచ్చగొట్టారు. ఫలితంగా జన సైనికులు చెప్పులుచూపించారు. దీంతో అక్కడ లేని వీర మహిళపై సైతం కేసులు నమోదుచేసి అరెస్ట్ చేశారు. కానీ రెచ్చగొట్టిన మంత్రి రోజాపై ఎటువంటి కేసూ లేదు. అదే విపక్ష నాయకులు రెచ్చగొట్టారని సాకు చూపి ఏకంగా పార్టీ కార్యాలయాలపై దాడులకు తెగబడుతున్నా పట్టించుకోవడం లేదు. ఇక్కడ మాత్రం రెచ్చగొట్టారు అన్న కారణం చూపి విపక్ష నాయకులను అరెస్ట్ చేయడంతో పాటు థర్డ్ డిగ్రీ ప్రయోగించి ప్రతాపం చూపిస్తున్నారు.

మొత్తం పోలీస్ వ్యవస్థనే ఒక అసమాన్యంగా మార్చేశారు. తమకు ఒత్తాసు పలకకుండే భవిష్యత్ లో టీడీపీకి బలైపోతారని భయపెట్టి తమ గుప్పెట్లోకి తెచ్చుకుంటున్నారు. కొంతమంది పదోన్నతులకు ఆశపడి.. మరికొందరు కులం ముసుగులోప్రభుత్వానికి సహకరిస్తున్నారు. అయితే ఈ క్రమంలో నిజాయితీపరులైన అధికారులను రిజర్వ్ లో పెట్టి ప్రభుత్వ పెద్దలు వికృత క్రీడకు పూనుకున్నారు. విపరీత మనస్తత్వం కలిగిన పాలకుడి ముద్ర పోలీస్ వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోంది. దాని ప్రభావమే దాడులు, దహనాలు, విధ్వంసాలు. అయితే అధికారం శాశ్వతం కాదు. అటుదిటైతే పరిస్థితి ఏమిటి. ఇప్పుడు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న టీడీపీ అధికారంలోకి వస్తే ఏదైనా చేయాలి. లేకుంటే చేతగానివారవుతామన్న భావన ఉంటుంది. అప్పుడు మూల్యం చెల్లించుకునేది మాత్రం ముమ్మాటికీ పోలీస్ వ్యవస్థే…