
Rakul Preet Singh: స్టార్ లేడీ రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యాషన్ ఐకాన్ అని చెప్పవచ్చు. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన రకుల్ హీరోయిన్ కాకముందు అందాల పోటీలలో కూడా పాల్గొన్నారు. ఇక తరచుగా హాట్ అండ్ గ్లామరస్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ గ్రీన్ కలర్ ట్రెండీ అవుట్ ఫిట్ ధరించి మనసులు దోచేశారు. బ్లేజర్ చాటు నుండి యద అందాలు ప్రదర్శించారు. రకుల్ హాట్నెస్ కుర్రాళ్ళ గుండెల్లో గుబులు రేపింది. దానికి తోడు ఆమె బోల్డ్ కామెంట్ మరింత రెచ్చగొట్టింది. ‘ఏమీ చూస్తున్నారు?’అని రకుల్ తన ఫోటోలకు కామెంట్ పెట్టగా ఫ్యాన్స్ మనసులో మాట బయటపెడుతున్నారు.
రకుల్ ప్రీత్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ కి కామెంట్స్, లైక్స్ వెల్లువెత్తుతున్నాయి. కాగా రకుల్ ఈ ఏడాది వివాహం చేసుకుంటారన్న ప్రచారం గట్టిగా జరుగుతుంది. రెండేళ్లుగా ఆమె నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో రిలేషన్ లో ఉన్నాడు. 2021లో తన బర్త్ డే నాడు జాకీని ప్రేమిస్తున్నట్లు వెల్లడించారు. అతనితో దిగిన ఫోటో షేర్ చేసి కన్ఫర్మ్ చేశారు. అప్పటి నుండి పెళ్లి వార్తలు జోరందుకున్నాయి.
పదే పదే పెళ్లి గురించి అడుగుతుంటే రకుల్ ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆమె తమ్ముడు ఈ ఏడాది రకుల్ పెళ్లి చేసుకునే అవకాశం కలదని హింట్ ఇచ్చాడు. పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రొఫెషన్ లో బిజీగా ఉండటం వలన ఆలస్యం అవుతుందని చెప్పారు. ఇటీవల ముంబైలో జరిగిన కియారా-సిద్దార్థ్ మల్హోత్రా రిసెప్షన్ వేడుకకు రకుల్ ప్రియుడు జాకీ భగ్నానీతో జంటగా హాజరయ్యారు.

ఇక రకుల్ టాలీవుడ్ కి దూరమయ్యారు. వరుస పరాజయాల నేపథ్యంలో మేకర్స్ పక్కన పెట్టేశారు. రకుల్ చివరి రెండు తెలుగు చిత్రాలు చెక్, కొండపొలం అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో పూర్తిగా తెలుగు పరిశ్రమను వదిలేశారు. ఆమె బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది . అదే సమయంలో తెలుగులో ఫేడ్ అవుట్ అయ్యింది.
రకుల్ నటిస్తున్న భారీ చిత్రం భారతీయుడు 2. వివాదాలతో ఆగిపోయిన ఈ మూవీ గత ఏడాది తిరిగి పట్టాలెక్కింది. కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ నందు కాజల్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ ఏడాది భారతీయుడు 2 విడుదల కానుంది. ఇటీవల రకుల్ ఛత్రీవాలీ టైటిల్ తో ఒక మూవీ విడుదల చేశారు. నేరుగా ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన ఛత్రీవాలీ హిట్ టాక్ తెచ్చుకోవడం విశేషం.