
Dog Attack On Child: పిల్లలు మారం చేస్తే తల్లిదండ్రులు అక్కడ బూచోళ్ళు ఉన్నారని భయం చెప్తారు.. కానీ ఇకనుంచి అక్కడ భౌ భౌలు ఉన్నాయి జరభద్రం అని కూడా హెచ్చరించాల్సి ఉంటుంది.. ఎందుకంటే అంతలా పెరిగిపోయాయి కుక్కలు. అంతేకాదు దారుణంగా దాడులు చేస్తున్నాయి. చంపేందుకు కూడా వెనుకాడటం లేదు.. హైదరాబాద్ అంబర్ పేట చే నంబర్ చౌరస్తా లో ఆదివారం ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్ ను చుట్టు ముట్టి పాశవికంగా కరిచి అతడి ప్రాణాలను బలిగొన్న సంఘటన అందరిని కలిసి వేసింది.. ఇక ఇదే కాక సోమవారం నాలుగేళ్ల వయసు పిల్లలపై ఇదే తరహా సంఘటనలు జరిగాయి.. హైదరాబాద్ కొత్తపేట మారుతి నగర్ లో వాచ్ మన్ బాలు రుషి రోడ్డుపై ఆడుకుంటుండగా వీధి కుక్క వెంబడించి, గాయపరిచింది. బాలుడి కేకలు విన్న తల్లిదండ్రులు బయటకు వచ్చి గట్టిగా అరవడంతో కుక్క పారిపోయింది. భద్రాద్రి జిల్లా సుజాతనగర్లో అనే ఫజియా నాలుగేళ్ల అమ్మాయి చేతిని గట్టిగా పట్టుకుని ఈడ్చుకుని వెళ్లే ప్రయత్నం చేశాయి.. చుట్టు పక్కల వారు స్పందించి తరమడంతో ప్రాణాపాయం తప్పింది.
పాపం ప్రదీప్ కుటుంబం
ప్రదీప్ కుటుంబానిది నిజామాబాద్ జిల్లా ఇందల్ వాయి. ప్రదీప్ పుట్టినప్పుడే అతడి తండ్రి గంగాధర్ బతుకుదెరువు కోసం నగరానికి వచ్చాడు.. బాగ్ అంబర్పేట్ డివిజన్ ఎరుకల బస్తీ లో నివాసం ఉంటూ చే నెంబర్ చౌరస్తాలోని రెనాల్ట్ కార్ల సర్వీసింగ్ సెంటర్లో వాచ్మెన్ గా పనిచేస్తున్నారు.. గంగాధర్ కు కొడుకు ప్రదీప్ తో పాటు ఆరేళ్ల వయసున్న మేఘన అనే కుమార్తె కూడా ఉంది. ఆదివారం పిల్లలను తీసుకొని సర్వీసింగ్ సెంటర్ వెళ్లారు.. మేఘనను పార్కింగ్ సెక్యూరిటీ క్యాబిన్ లో ఉంచి ప్రదీప్ ను సర్వీసింగ్ సెంటర్లోకి తీసుకెళ్లాడు. అయితే బాలుడు కొద్దిసేపటికే అక్క వద్దకు వస్తుండగా కార్ల కింద ఉన్న నాలుగు కుక్కలు దాడి చేశాయి. పరిగెత్తబోయి జారి పడిపోయిన అతనిని తీవ్రంగా కరిచాయి.. ఇదే విషయాన్ని మేఘన తండ్రి గంగాధర్ కు చెప్పగా.. అతడు హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాడు.. కాగా అతడు అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు..కార్ల సర్వీస్ సెంటర్ నిర్వాహకులు 50 వేలు ఇవ్వడంతో గంగాధర్ కుటుంబం ఇందల్ వాయి వెళ్ళిన ప్రదీప్ అంత్యక్రియలు నిర్వహించింది.
ఇక ఈ సంఘటనపై కేసు నమోదు కాలేదు. ఈ విషయం అంబర్ పేట పోలీసులకు తెలిసినా భారత రాష్ట్ర సమితి లో ఓ కీలక నాయకుడి సూచనతో కేసు చేయలేదని తెలుస్తోంది. అంతే కాదు ఇదే డివిజన్ లో తులసీ రాం నగర్ లో ఇటీవల నాలుగేళ్ల బాలుడు ఆకాష్ ను వీధి కుక్కలు తీవ్రంగా గాయపరిచాయి.. మరో వైపు రాష్ట్రంలో కుక్కకాటు కేసులు పెరిగిపోతున్నాయి. హైదరాబాదులోని నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి ఈనెల 20 రోజుల్లో జంట నగరాలు, వివిధ జిల్లాల నుంచి 1500 కుక్క కాటు కేసులు వచ్చాయి. వీరిలో 12 సంవత్సరాల పిల్లలు 500 మంది ఉండటం విశేషం. ఈనెల 13న ఏకంగా 120 మంది బాధితులు చికిత్సకు వచ్చారు.

కుక్కలకు మాంసం దొరకడం లేదట!
ప్రదీప్ మృతి పై హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి విచారణకు ఆదేశించారు.. ప్రదీప్ పై దాడి చేసిన కుక్కలకు ఓ మహిళ రోజు మాంసం పెట్టే వారిని, రెండు రోజులుగా ఆమె లేకపోవడంతో వాటికి ఆహారం దొరకలేదన్నారు. ఆకలితోనే అవి దాడి చేసి ఉండవచ్చని వివరించారు.. మరోవైపు ప్రదీప్ మృతి పై మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు.. ఇక ఈ సంఘటనపై ప్రతిపక్షాలు ఆ గ్రహం వ్యక్తం చేస్తున్నారు.. విశ్వ నగరంగా తీర్చి దిద్దుతున్నామని చెప్తున్నా పాలకులు, వీధి కుక్కలను సంహరించలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేస్తున్నారు.