spot_img
Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu Foundation: మనసున్న మారాజు... కొత్త ఏడాదికి మహేష్ చేసిన మంచి పని తెలిస్తే!

Mahesh Babu Foundation: మనసున్న మారాజు… కొత్త ఏడాదికి మహేష్ చేసిన మంచి పని తెలిస్తే!

Mahesh Babu Foundation:  ‘ఊరు మనకు చాలా ఇచ్చింది… తిరిగి ఇచ్చేయాలి, లేదంటే లావైపోతాం’ శ్రీమంతుడు మూవీలో హీరోయిన్ శృతి హాసన్ చెప్పే ఈ డైలాగ్ బాగా ప్రాచుర్యం పొందింది. ఉపకారానికి పరోపకారం చేయడం అవసరమని దానర్థం. ఆ విధంగా వెండితెర సూపర్ స్టార్స్ కూడా ఈ సమాజానికి చాలా రుణపడి ఉన్నారు. వారు అనుభవించే స్టార్డం, నేమ్, ఫేమ్, లగ్జరీలు అన్నీ అభిమానులు ఇచ్చినవే. ఎలాంటి సంబంధం లేకపోయినా నచ్చిన హీరోని కుటుంబ సభ్యుడిగా అభిమానులు ఫీల్ అవుతారు. ఆయన కోసం పోరాడతారు. అంతగా అభిమానించే జనాలకు తిరిగి సహాయం చేయడం హీరోల సామాజిక బాధ్యత.

Mahesh Babu Foundation
Mahesh Babu Foundation

టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఏదో ఒక రూపంలో సమాజానికి బాసటగా నిలుస్తున్నారు. వారిలో మహేష్ బాబు ముందు వరుసలో ఉంటారు. ఆయన చిన్నపిల్లలకు ప్రాణదానం చేసే బాధ్యత తీసుకున్నారు. ఏళ్లుగా చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయిస్తున్నారు. ఈ విషయం చాలా కాలం గోప్యంగా ఉండి పోయింది. పబ్లిసిటీ ఇష్టపడని మహేష్ తన ఫౌండేషన్ ద్వారా హార్ట్ సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు వైద్యం చేయిస్తున్నాడు. దీని కోసం ప్రముఖ ఆసుపత్రులతో ఆయన చేయి కలిపారు.

ఇప్పటి వరకు వందల మంది చిన్నారులకు మహేష్ బాబు హార్ట్ ఆపరేషన్స్ చేయించారు. ఈ సేవలు మరింతగా విస్తరించేందుకు మహేష్ అధికారిక వెబ్సైట్ ప్రారంభించారు. న్యూ ఇయర్ సందర్భంగా maheshbabufoundation.org ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని సితార సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇక నాన్న మహేష్ సామాజిక సేవలో తాను కూడా భాగం అవుతానన్న సితార ఈ నెల పాకెట్ మనీ మహేష్ బాబు ఫౌండేషన్ కి డొనేట్ చేస్తున్నట్లు తెలియజేసింది. అలాగే ఆసక్తి ఉన్నవారు తమ వంతు సహాయం చేయవచ్చని వెల్లడించారు.

Mahesh Babu Foundation
Mahesh Babu Foundation

కాగా మహేష్ ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేశారు. తమ సొంత ఊరు బుర్రిపాలెంతో పాటు తెలంగాణాలోని సిద్దాపురం గ్రామాన్ని మహేష్ దత్తత తీసుకోవడం జరిగింది. తన సంపాదనలో సామాజిక సేవకు కొంత కేటాయించి మహేష్ తన మంచి మనసులు చాటుకుంటున్నారు. మరోవైపు ఆయన ఎస్ఎస్ఎంబి 28 షూట్ కోసం సిద్ధం అవుతున్నారు. త్వరలో దర్శకుడు త్రివిక్రమ్ లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
NTR

NTR: కీలక నిర్ణయం దిశగా జూనియర్ ఎన్టీఆర్!

NTR: తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాతే ఎవరూ అంటే మాత్రం చటుక్కున లోకేష్ పేరు వస్తుంది. ప్రస్తుతం ఆయన అనధికార అధినేత తెలుగుదేశం పార్టీకి. పైగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అన్ని తానై...
Tammineeni Seetharam

Tammineeni Seetharam: ఏపీలో మారిన అరెస్టుల స్టైల్!

Tammineeni Seetharam: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అరెస్టు భయం వెంటాడుతోంది. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం కేసుల రూపంలో వెంటాడింది. కానీ కొందరు తమ వ్యవహార శైలితో ఏరి కోరి కేసులు తెచ్చుకున్నారు....
Ram Gopal Varma

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...
YSRCP

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...
Oktelugu Epaper